Avinash: అవినాష్ అరెస్ట్ ఫిక్స్.. జగన్ కు భారీ నష్టమేనా?

Avinash: వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి పేరుకి కీలకంగా మారిన సంగతి మనందరికీ తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాలలో ఎక్కడ చూసినా కూడా అవినాష్ రెడ్డి పేరు వినిపిస్తోంది. ఇప్పటికే కోర్టు అవినాష్ రెడ్డిని ఈనెల 25వ తేదీ వరకు అరెస్టు చేయకూడదు అంటూ ఆదేశాలను కూడా జారీ చేసిన విషయం తెలిసిందే. అవినాష్ రెడ్డిని ఇంకా ఈ కేసులో భాగంగా అరెస్టు చేయకముందే ఏపీలో రాజకీయాలు వేడెక్కిపోయాయి. ఇక పొరపాటున అవినాష్ రెడ్డి ని అరెస్టు చేస్తే ఇక పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అన్నది అంచనా వేయడం చాలా కష్టంగా మారుతోంది.

కాగా హైకోర్టులో అవినాష్ రెడ్డికి సీబీఐ అరెస్టు నుంచి తాత్కాలికంగానే అయినా ఊరట లభించడం అందరినీ విస్మయానికి గురి చేసిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తుందని అంతా భావించారు. కాగా ఆ దిశగా పలు విశ్లేషణలు కూడా జరుగుతున్న విషయం తెలిసిందే. హైకోర్టు ముందస్తు బెయిలుపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ ఈ నెల 25 వరకూ అవినాష్ రెడ్డి ప్రతి రోజూ సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సిందేనని చెప్పింది.

 

దీంతో అవినాష్ రోజూ క్రమం తప్పకుండా గంటల తరబడి సీబీఐ విచారణను ఎదుర్కొంటూ వస్తున్నారు. అనూహ్యంగా హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ వైఎస్ వివేకా కుమార్తె సునీత సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ కేసు మరింత కీలకంగా మారింది. సునీత పిటిషన్ ను సుప్రీం కోర్టు తాజాగా ఏప్రిల్ 21 విచారించిన విషయం తెలిసిందే. సీజేఐ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ నరసింహంలతో కూడిన ధర్మాసనం ముందు వాదనలు జరిగాయి. ఈ వాదనల సందర్భంగా సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు. అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిలు ఇస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు అలాంటి తీర్పులు ఎలా ఇస్తారని ఒకంత తీవ్రంగానే వ్యాఖ్యానించారు. అంతే కాదు హైకోర్టు ఇక అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఎలాంటి విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు విస్పష్టంగా పేర్కొంది. ఈ నెల 25న ముందస్తు బెయిల్ విషయంలో తుది తీర్పు ఇస్తామని తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్యులలో పేర్కొంది. ఇకపోతే మరోవైపు ఏపీలో ఒకవేళ అవినాష్ రెడ్డికి శిక్ష పడితే ఎన్నేళ్లు పడుతుంది ఖచ్చితంగా శిక్ష పడుతుందా అంటే కచ్చితంగా శిక్ష పడుతుంది. 14 ఏళ్ల పాటు అవినాష్ రెడ్డి జైలు శిక్ష అనుభవించబోతున్నారు అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -