Avinash: వైరల్ అవుతున్న అవినాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Avinash: వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సిబిఐ విచారణలో భాగంగా అవినాష్ రెడ్డి ఎప్పుడైనా అరెస్టు కావచ్చు అని వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా ఈ విషయం గురించి అవినాష్ రెడ్డి మాట్లాడుతూ సిబిఐ ధోరణిని తప్పుపట్టారు. సిబిఐ ఉద్దేశపూర్వకంగా ఈ కేసులో నన్ను ఇరికించడం కోసమే ఇలా కుట్ర పడుతున్నారని ఆయన తెలియజేశారు.

 

గత రెండు సంవత్సరాలుగా తాను ఈ విషయాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోలేదని తెలిపారు. అయితే సిబిఐ అధికారులు ఈ కేసును ఒకే వైపు నుంచి మాత్రమే దర్యాప్తు చేస్తున్నారని మరోవైపు నుంచి కూడా దర్యాప్తు చేసే నిజా నిజాలు బయటకు రాబట్టాలని తెలియజేశారు.సిబిఐ అధికారుల ముందు సునీత మొదటి సారి ఇచ్చిన వాంగ్మూలానికి రెండవసారి ఇచ్చిన వాంగ్మూలానికి చాలా తేడాలు ఉన్నాయని ఈయన తెలియజేశారు.

 

వైయస్ వివేకానంద రెడ్డి చనిపోయిన రోజు తాను ఇంట్లోనే ఉన్నానంటూ తనపై నిందలు వేస్తున్నారు. అయితే ఆరోజు తాను జమ్మలమడుగుకి వెళ్ళానని తనతో పాటు 20 మంది కూడా వచ్చారని మార్గమధ్యమంలో ఈ విషయం తెలిసి తాను వెనుతిరిగానని అవినాష్ రెడ్డి తెలిపారు. ఆరోజు తనతో పాటు వచ్చిన వారిని విచారించిన ఈ విషయం తెలుస్తుందని తెలిపారు.

 

వైయస్ వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు ఆయన రాసిన లేక తన సెల్ఫోన్ సాయంత్రం వరకు దాచిపెట్టారు. సాయంత్రం ఆయన రాసిన లెటర్ తన సెల్ఫోన్ బయటపెట్టారు. సిబిఐ ఈ కోణంలో ఎందుకు ఈ కేసును విచారణ జరపలేదని ఆయన ప్రశ్నించారు.నేను ఎలాంటి పాపం చేయకపోయినా తనని అనవసరంగా ఈ కేసులో ఇరికించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, సిబిఐ మరొక కోణంలో కూడా దర్యాప్తు చేసే నిజానిజాలు బయటకు రాబట్టాలని ఈయన ఈ సందర్భంగా కోరుకున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -