Guava Leaves: బాబోయ్.. జామ ఆకుల వల్ల అన్ని ప్రయోజనాల?

Guava Leaves: సాధారణంగా కొన్ని సీజన్లలో మనకు కొన్ని పండ్లు మాత్రమే దొరుకుతూ ఉంటాయి. అలాంటి వాటిలో జామకాయ కూడా ఒకటి. కానీ రాను రాను జామకాయలు అన్ని సీజన్లో కూడా లభిస్తున్నాయి. జామకాయలు పేదవాడి యాపిల్ అని కూడా పిలుస్తారు. ఈ పండులో చక్కెరలు విటమిన్లు ఖనిజాలు లభిస్తాయి. జామ పండులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. జామపండు వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. కేవలం జామపండు వల్ల మాత్రమే కాకుండా జామ ఆకుల వల్ల కూడా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

మరి జామ ఆకుల వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. జామ ఆకులు కూడా ఎంతో శ్రేష్టమైనవి. జామ ఆకులతో టీ చేసుకుని తాగితే పలురకాల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. జామకాయల్లో లానే జామాకుల్లో కూడా విటమిన్ సి అధికంగా ఉంటుంది. జామ ఆకులు శరీరంలోని పలు రకాల ఇన్ఫెక్షన్లను పోగొడతాయి. బ్యాక్టీరియా, వైరస్‌లు కలుగజేసే వ్యాధులు దరి చేరవు. దగ్గు, జలుబు పోతాయి. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.

ఇందులో యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.

 

చర్మానికి ఉపయోగపడే కాంపౌండ్స్‌ వీటిలో ఉండటం వల్ల మొటిమలు తగ్గిపోతాయి. యవ్వనంగా కనిపిస్తారు. జామ ఆకులతో చేసిన టీ తాగటం వల్ల బరువు తగ్గే అవకాశం ఎక్కువ. ఎందుకంటే కొవ్వుశాతాన్ని తగ్గిస్తుంది. బీపీని అదుపులో ఉంచుతుంది. రక్తంలో చక్కెర శాతాన్ని అదుపులో ఉంచుతుంది.ఈ ఆకుల్లో ఫ్రీ రాడికల్స్‌ ఉంటాయి. క్యాన్సర్‌ రాకుండా చేసే గుణం వీటికి ఉంది. కంటికి మంచిది. ఈ టీని నొప్పుల నివారణకు కూడా ఉపయోగిస్తారు. ప్రశాంతమైన నిద్ర పడుతుంది. మెదడు ఆరోగ్యానికి మంచిది. పంటినొప్పిని తగ్గిస్తుంది.

 

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -