Undavalli Sridevi: ఉండవల్లి శ్రీదేవి విషయంలో బాబు సంచలన నిర్ణయం.. అక్కడినుంచి ఎంపీగా పోటీ చేస్తారా?

Undavalli Sridevi: యువగళం పాదయాత్ర చేస్తున్న తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆదివారం మధ్యాహ్నం తాడికొండలో ప్రవేశించారు. ఆయనకి మాజీ ఎమ్మెల్యే శ్రవణ్, అమరావతి పరిరక్షణ సమితి నాయకులు కొలకపూడి శ్రీనివాస్ ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత రైతుల కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారులోకేష్. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి. తాడికొండ నియోజకవర్గానికి ప్రాతినిధ్యాన్ని నిర్వహిస్తున్న శ్రీదేవిని వైఎస్ఆర్ సీపీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు అనే కారణంతో ఆమెపై సస్పెన్షన్ వే టు వేసింది. దాని తర్వాత ఆమె తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడుని కలిసి పార్టీలో చేరటానికి తన ఆసక్తిని చూపించారు శ్రీదేవి. ఆమె రాకను చంద్రబాబు నాయుడు కూడా స్వాగతించారు. అయితే చంద్రబాబు నాయుడు బాపట్ల లోక్సభ టికెట్ ను ఆమెకి ఖాయం చేసినట్లు తెలిసింది. కానీ ఆమె ప్రతిపాడు అసెంబ్లీ టికెట్ని కోరుకుంటున్నట్లు సమాచారం.

 

తాడికొండ సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతో మళ్ళీ గెలుస్తానని ధీమాను వ్యక్తం చేస్తున్నారు శ్రీదేవి. అయితే ఆమె కోరిక తీరలేదు ఎందుకంటే అక్కడ మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ కి అప్పటికే చంద్రబాబు టికెట్ ఖరారు చేయడంతో శ్రీదేవికి మొండి చేయి చూపించినట్లు అయింది. అయితే ఆమె కనీసం ప్రతిపాడు టికెట్ అయినా ఇవ్వాలని ఆమె విజ్ఞప్తి చేసింది. అది కూడా సాధ్యపడేలాగా లేదు ఎందుకంటే ఆ టికెట్ ను ఆల్రెడీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రామాంజనేయులు కి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉండవల్లి శ్రీదేవిని బాపట్ల లోక్ సభ బరిలో దింపే యోజనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది.

 

2019 ఎన్నికల్లో నందిగాం సురేష్ ఇక్కడ నుంచి ఘనవిజయం సాధించారు. సీనియర్ నేత శ్రీరామ్ మాల్యాద్రిని మట్టికరించా.రు ప్రస్తుతం శ్రీరామామ్ మాల్యాద్రి రాజకీయాలలో పెద్దగా క్రియాశీలకంగా ఉండటం లేదు. ఇక్కడ ఏర్పడిన ఈ లోటును ఉండవల్లి శ్రీదేవితో భర్తీ చేయాలని అభిప్రాయంలో చంద్రబాబునాయుడు ఉన్నట్లు తెలుస్తోంది. నందిగామ సురేష్, ఉండవల్లి శ్రీదేవి మధ్య వ్యక్తిగత విభేదాలు సుదీర్ఘ కాలం పాటు కొనసాగుతున్నాయి. ఇప్పుడు అవి రాజకీయ విభేదాలుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -