Sridevi: వైసీపీకి భారీ షాకిచ్చిన శ్రీదేవి.. ఆ పార్టీకి షాకిచ్చే మరి కొందరు నేతలు వీళ్లేనా?

Sridevi: ఉండవల్లి శ్రీదేవి గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. ఈమె ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో భాగంగా తెలుగుదేశం ప్రభుత్వానికి మద్దతుగా నిలబడటంతో పెద్ద ఎత్తున ఈమె పట్ల అధికార పార్టీ నేతలు విమర్శించారు. అంతేకాకుండా తనని పార్టీ నుంచి కూడా బహిష్కరించారు. ఇలా తాటికొండ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఉండవల్లి శ్రీదేవి పార్టీ నుంచి బహిష్కరణ చేయడంతో ఈమె తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలబడ్డారు.

ఈ క్రమంలోనే ఈ వివాదం తర్వాత మొదటిసారి ఈమె నారా లోకేష్ యువగలం పాదయాత్రలో భాగంగా రావెల సమీపంలో ఏర్పాటు చేసిన అమరావతి ఆవేదన సభకు వ్యాఖ్యతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైసిపి ప్రభుత్వం పై ఈమె తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.ప్రజల కోసం పోరాటం చేస్తున్న తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉండి వచ్చే ఎన్నికలలో 175 స్థానాలలోగెలిపించండి ప్రజా రాజధాని అమరావతి కల నెరవేరాలి అంటే చంద్రబాబు అధికారంలోకి రావాలని తెలిపారు.

 

నా కారణంగా అమరావతి రైతులకు జరిగిన అన్యాయానికి తాను తలవంచి క్షమాపణలు కోరుతున్నాను అంటూ ఈ సందర్భంగా ఈమె అమరావతి రైతులకు క్షమాపణలు కోరారు. ఇక అమరావతి రాజధానిగా ఉంటుందని నన్ను కూడా మోసం చేశారని వైసీపీ ప్రభుత్వం పై ఉండవల్లి విమర్శలు చేశారు. ఇకపై రైతులపై పోలీసుల జులం ప్రదర్శించిన వారికి ఏమైనా చేయాలని తలపెట్టిన రైతులకు మద్దతుగా ఉండవల్లి శ్రీదేవి ముందు వరుసలో ఉంటుందని తెలిపారు.

 

వైకాపా గుర్తుపై గెలిచిన నేను ఉద్యమంలోకి ముందుకు రాలేకపోయాను ఇప్పుడు నా వెనుక చంద్రబాబు నాయుడు లోకేష్ గారు ఉన్నారని తెలిపారు. ప్రతిక్షణం రైతులు పడుతున్న బాధను తాను పడ్డానని ప్రతిరోజు ఏడ్చేదాన్ని ఈ రాక్షస పాలన నుంచి ఎప్పుడు బయటపడతానా అని ఎదురుచూస్తూ ఉండే దానిని అంటూ ఈ సందర్భంగా వైసీపీపై విమర్శలు చేశారు.

 

ఈ విధంగా అధికార పార్టీ గురించి ఉండవల్ల శ్రీదేవి విమర్శలు కురిపిస్తూ తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలియజేశారు. ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశం పార్టీ చెంతకు చేరబోతున్నారని ఈ దెబ్బతో వైసీపీకి గట్టి షాక్ తగులుతుందని పలువురు భావిస్తున్నారు. మరి వచ్చే ఎన్నికలలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయం గురించి కూడా పెద్ద ఎత్తున చర్చలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయని చెప్పాలి.

 

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -