Boney Kapoor: శ్రీదేవి మరణం వెనుక ఉన్న కారణాలను బయట పెట్టిన బోని కపూర్?

Boney Kapoor:  తెలుగు ప్రేక్షకులకు అతిలోకసుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆమె బాలీవుడ్ తో పాటు టాలీవుడ్లో అలాగే ఇతర భాషల్లో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకుంది. అంతేకాకుండా ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. అయితే ప్రస్తుతం ఆమె మనకు భౌతికంగా దూరం అయినప్పటికీ ఆమె జ్ఞాపకాలు ఇంకా కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నాయి. ఈమె 2018 లో ప్రమాదవశాత్తు చనిపోయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆమె మరణం పట్ల అనేక రకాల అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి.

అయితే ఇప్పుడు ఆ సంఘటన గురించి పరోక్షంగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు శ్రీదేవి భర్త బోనీ కపూర్. ఇంతకీ 2018లో ఏం జరిగింది అంటే…2018 ఫిబ్రవరిలో ఫ్రెండ్ కుటుంబంలో పెళ్లికి హాజరయ్యేందుకు శ్రీదేవి, తన ఫ్యామిలీతో కలిసి దుబాయి వెళ్లింది. అయితే బాత్‌టబ్‌లో జారిపడి చనిపోయిందన‍్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈమె ప్రమాదవశాత్తూ మృతి చెందడంతో చాలామంది బోనీ కపూర్‌ని అనుమానించారు. కానీ ఇన్నాళ్లుగా ఆ సంఘటన గురించి పెద్దగా తలుచుకోని ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా బోని కపూర్ మాట్లాడుతూ..

స్క్రీన్‌పై అందంగా కనిపించడం కోసం శ్రీదేవి స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతుండేది. మా పెళ్లి తర్వాత ఈ విషయం నాకు తెలిసింది. ఉప్పు లేకుండా భోజనం చేసేది. దీంతో చాలాసార్లు నీరసించి కింద పడిపోయేది. లో బీపీ సమస్య ఉందని, జాగ్రత్తగా ఉండమని ఆమెని డాక్టర్స్ ఎంతగానే చెప్పారు. కానీ అస్సలు సీరియస్‌గా తీసుకోలేదు. శ్రీదేవిది సహజ మరణం కాదు. ప్రమాదవశాత్తు చనిపోయింది.దీంతో దుబాయి పోలీసులు నన్ను ఒక రోజంతా విచారించారు. లై డిటెక్టర్ టెస్ట్ చేశారు. భారత మీడియా నుంచి ఒత్తిడి కారణంగా నన్ను అన్ని విధాల పరీక్షిస్తున్నట్లు చెప్పారు. శ్రీదేవి చనిపోయిన కొన్నిరోజులు నాగార్జున ఓసారి కలిశారు. డైట్ కారణంగా ఓసారి సెట్‌లో శ్రీదేవి స్పృహ తప్పి పడిపోయినట్లు చెప్పారు అని బోనీ కపూర్ తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

Polavaram Project: పోలవరం వైపు ఒకసారి చూసి ఓటు వేయండి.. ఏపీలో ఇంత దారుణ పరిస్థితులా?

Polavaram Project: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల కాలంలో పెద్ద ఎత్తున కరువు కాటకాలను ఎదుర్కొంటూ ఉందని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి ప్రాజెక్టులను పూర్తి చేయలేదు...
- Advertisement -
- Advertisement -