Sridevi-Srilatha: ప్రముఖ నటి శ్రీదేవి చనిపోయినా సొంత చెల్లి రాకపోవడానికి కారణమిదే.. ఏం జరిగిందంటే?

Sridevi-Srilatha: దివంగత హీరోయిన్ అతిలోక సుందరి శ్రీదేవి గురించి మనందరికీ తెలిసిందే. తెలుగులో దాదాపు స్టార్ హీరోలు అందరు సరసన నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా తెలుగులో సీనియర్ ఎన్టీఆర్ సినిమాలలో ఎక్కువగా నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొంతకాలం పాటు ఒక వెలుగు వెలిగింది. దాదాపు 300కు పైగా సినిమాలలో నటించింది. ఆమె భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె జ్ఞాపకాలు ఇంకా కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నాయి. ఈమె బాలీవుడ్ డైరెక్టర్ బోని కపూర్ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు.

కాగా తమిళనాడులోని మీనం పట్టి గ్రామంలో రాజేశ్వరి అయ్యప్పన్ అనే దంపతులకు ఇద్దరు కుమార్తెలు కాగా వారిలో పెద్దమ్మాయి శ్రీదేవి. అయితే శ్రీదేవికి చెల్లెలు శ్రీలత ఉంది అన్న విషయం చాలామందికి తెలియదు. ఆమె సినిమాల్లోకి రాలేదు. కానీ అప్పట్లోనే శ్రీదేవి ఏ సినిమాకు వెళ్లిన ఆమెతోపాటు శ్రీలత కూడా ఆ సినిమాకి వెళ్ళేది. తల్లి రాజేశ్వరితో పాటు, శ్రీలత కూడా శ్రీదేవితో పాటే ఉండేవారు. శ్రీలత దాదాపు 1972 నుంచి 1993 వరకు సినిమా సెట్స్‌లో శ్రీదేవితో పాటు వెళ్లేవారు. అలా 21 ఏళ్ల పాటు అక్క సినీ ప్రస్థానంలో తోడుగా నిలిచారు. అప్పట్లో వీరి కుటుంబం తమిళనాడులో శివకాశిలో ఉండేది. శ్రీదేవి కెరీర్ ప్రారంభం నుంచి ప్రతి సినిమా సెట్స్‌లో శ్రీలత కనిపించారు. శ్రీలత కూడా శ్రీదేవి లాగే నటి కావాలనుకుంది.

కానీ ఆమె ఆ విషయంలో సక్సెస్ కాలేకపోయింది. ఆ తర్వాత శ్రీదేవికి మేనేజర్‌గా మారింది. అయితే శ్రీదేవి తల్లి రాజేశ్వరి మరణం వారి మధ్య దూరాన్ని పెంచింది. తల్లి మరణంతో ఇద్దరు సోదరీమణుల మధ్య విభేదాలు పెరిగాయి. శ్రీదేవి తల్లి అనారోగ్యంతో ఉండగా ఒకసారి ఆపరేషన్ చేయించాలని ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలో డాక్టర్ చేసిన తప్పుకు ఆమె తల్లి జ్ఞాపకశక్తిని కోల్పోయింది. ఆ తర్వాత కోలుకోలేక రాజేశ్వరి 1996లో మరణించింది. దీంతో శ్రీదేవి ఆసుపత్రిపై కేసు పెట్టవలసి వచ్చింది. ఈ కేసులో చివరికీ శ్రీదేవిని గెలిచింది. తల్లి మరణంతో పరిహారంగా రూ.7.2 కోట్లు పొందింది. ఆస్పత్రి పరిహారంగా చెల్లించిన రూ.7.2 కోట్లు శ్రీదేవి తన వద్దే ఉంచుకుందని సోదరి శ్రీలత ఆరోపించింది. దీంతో అక్కాచెల్లెళ్ల మధ్య విభేదాలు తలెత్తినట్లు సమాచారం.

శ్రీలత తన వాటా డబ్బుల కోసం శ్రీదేవిపై కోర్టులో కేసు కూడా వేసింది. తన తల్లి మానసిక పరిస్థితి బాగా లేదని అందుకే తన ఆస్తి మొత్తాన్ని శ్రీదేవికి బదిలీ చేసిందని ఆరోపించింది. శ్రీలత ఈ కేసులో గెలిచి తన వాటాగా రూ.2 కోట్లు దక్కించుకుంది. డబ్బుల విషయంలో తలెత్తిన వివాదం అక్కా, చెల్లెల్ల బంధాన్ని చెరిపేసింది. అంతా అన్యోన్యంగా ఉండేవారు కేవలం డబ్బువల్లే శత్రువులుగా మారిపోయారు. ఇద్దరు అక్కాచెల్లెళ్ల మధ్య సయోధ్య కుదిర్చేందుకు అప్పట్లో బోనీకపూర్ కూడా ప్రయత్నించినట్లు సమాచారం. కాగా సూపర్‌ స్టార్‌గా ఎదిగిన శ్రీదేవి 2018లో దుబాయ్‌లో ఒక హోటల్‌లో మరణించారు. ఈ వివాదం వల్లే శ్రీదేవి మరణం తర్వాత చెన్నైలో జరిగిన ప్రార్థనా సమావేశంలో శ్రీలత కనిపించలేదని చెబుతున్నారు. వారి మధ్య డబ్బు విషయంలో తలెత్తిన మనస్పర్ధలు కారణంగా కనీసం శ్రీదేవి చివరి చూపుకు కూడా శ్రీలత రాలేదు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -