Adipurush: ఆదిపురుష్ మూవీలో ఇలాంటి చెత్త డైలాగ్సా.. ఓం రౌత్ కు బుద్దుందా?

Adipurush: ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆదిపురుష్ సినిమా ఎట్టకేలకు విడుదల అయ్యింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాను చూసిన తర్వాత కొంతమంది విమర్శిస్తుండగా మరికొందరు పాజిటివ్ గానే స్పందిస్తున్నారు. ఈ సినిమాలోని కొన్ని డైలాగ్స్ మాత్రం ఆమోదయోగ్యంగా లేవని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తైలం నీ బాబుది, కాలేది కూడా నీ బాబుదే అంటూ హనుమంతుని పాత్ర డైలాగ్స్ చెప్పడం ప్రేక్షకులకు నచ్చదు.

అయితే ఓం రౌత్ ఈ సినిమా స్టార్టింగ్ లోనే తన ఊహలకు అనుగుణంగా ఈ సినిమాను తీశానని చెబుతూ ఈ సినిమాపై విమర్శలు చేయాల్సి వస్తే తనపైనే చేయాలని పరోక్షంగా చెబుతున్నారు. రామాయణం గురించి ఏ మాత్రం తెలియని వాళ్లకు మాత్రం ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. ఇందులో త్రీడీ షాట్స్ అద్భుతంగా ఉన్నాయి. కొన్ని త్రీడీ షాట్స్ భయపెట్టే విధంగా ఉంటే మరికొన్ని త్రీడీ షాట్స్ మాత్రం ఆశ్చర్యానికి గురి చేసే విధంగా ఉన్నాయి. ఆదిపురుష్ సినిమాలోని రావణుని పాత్ర విషయంలో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 

సైఫ్ అలీ ఖాన్ మాత్రం ఈ సినిమాకు మైనస్ అయ్యారన్న ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే సినిమా ఇలా పాజిటివ్ నెగిటివ్ టాక్ లను సొంతం చేసుకున్నప్పటికీ ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు మాత్రం భారీగానే ఉండనున్నాయని సమాచారం అందుతోంది. టాక్ తో సంబంధం లేకుండా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓం రౌత్ రామాయణంతో ప్రయోగాలు చేయకుండా అవేంజర్స్ తరహా సినిమాలు చేస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -