Bahubali: బాహుబలిలో ఆ ఒక్క సీన్ మొదట అనుకున్నట్లు తీసినట్లైతే మరో స్థాయిలో ఉండేదట!

Bahubali: తెలుగు ప్రేక్షకులకు బాహుబలి సినిమా గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఈ సినిమాకు రాజమౌళి ప్రపంచ స్థాయిలో ప్రాణం పోశాడు. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా ప్రేక్షకులను మరో స్థాయిలో ఆకట్టుకుంది. అయితే ఈ ఆదివారంతో ఈ సినిమా ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుంది అట. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన విషయం తెలుసుకుందాం.

ప్రస్తుతం ఉన్న సినిమాలో బాహుబలి విగ్రహం లేపిన తర్వాత ఇంటర్వెల్ వస్తుంది. కానీ మొదట రాజమౌళి వేరే సన్నివేశం వద్ద ఇంటర్వెల్ చేయాలనుకున్నాడట. మాహిష్మతి ఊపిరి పీల్చుకో నా కొడుకు వచ్చాడు బాహుబలి తిరిగి వచ్చాడు అని దేవసేన అన్నప్పుడు శివుడు నడుచుకుంటూ వస్తుంటే అతడి ఒడిలో నుంచి బాహుబలి ఫిగర్ రావడం పై ఇంటర్వెల్ ఇవ్వాలి. కానీ ఆ సన్ని వేశాన్ని అలా చేద్దాం అనుకోలేదట. శివుడు మాహిష్మతిలోకి వచ్చేటప్పుడు మంచు కొండల్లో సైనికులతో పోరాటం చేస్తూ చేస్తాడు.

అప్పుడు అక్కడ ఒక సైనికుడు శివుడిని చూసి బాహుబలి అని అనుకుంటాడు. ప్రభు నన్ను ఏమి చేయవద్దని వేడుకుంటాడు. అతడు అక్కడి నుంచి తప్పించుకొని వచ్చి బిజ్జల దేవుడికి జరిగిన విషయం చెబుతాడు. కానీ ఆ విషయాన్ని బిజ్జల దేవుడు నమ్మడు. బాహుబలి చనిపోయాడు. వాడి ప్రాణాలను మట్టిలో కలిపేసామని చెబుతాడు. అని అనగానే ఇటువైపు మట్టి గోడలు పగలగొట్టుకుని శివుడు రావాలి. రాజమౌళి ఈ సన్నివేశం దగ్గర ఇంటర్వెల్ వచ్చేలా చేద్దాం అనుకున్నాడు.

కానీ విగ్రహం పైకి లేపిన తర్వాత ఇంటర్వెల్ వస్తే బాగుంటుందని భావించి బిజ్జల దేవుడు డైలాగ్ సన్నివేశాన్ని తీసేసాము అని రాజమౌళి ఈ విషయాన్ని ఒక సందర్భంలో పంచుకున్నాడు. మరి ఏదైనా గాని బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డులను సృష్టించింది. తెలుగు సినిమా ఇండస్ట్రీ గర్వించేలా బాహుబలి సినిమా ప్రపంచ స్థాయిలో ప్రేక్షకు ఆదరణ దక్కించుకుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -