Balakrishna: ముహూర్త బ‌లం లేకే ఆ సినిమాలు పోయాయ్.. వైరల్ అవుతున్న బాలయ్య సంచలన వ్యాఖ్యలు!

Balakrishna: దసరా కానుకగా వచ్చిన భగవంత్ కేసరి సినిమా కలెక్షన్ల పరంగా దుమ్ము రేపుతుంది. బాలయ్య సినిమా అంటే ఫ్యాక్షన్, డ్రామా, ఫ్యామిలీ సెంటిమెంట్, రివెంజ్ ఇవే కనిపిస్తాయి. ఏ సినిమా చూసినా కథనం మారుతుందేమో గాని కథ ఇంచుమించు ఇలాగే ఉంటుంది. అయితే భగవంత్ కేసరి తో రూటు మార్చిన బాలకృష్ణ మరో హిట్ ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమా విజయవంతం అయిన సందర్భంగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు భగవంత్ కేసరి టీం.

అందులో భాగంగా ఒక ఇంటర్వ్యూలో రాపిడ్ ఫెయిర్ నిర్వహించింది శ్రీలీల. ఇందులో శ్రీ లీల అడిగిన ప్రశ్నలకు టకాటక సమాధానం చెప్పాలి బాలకృష్ణ. అయితే శ్రీ లీల అడిగిన ప్రశ్నలు బాగానే ఉన్నాయి.కానీ బాలయ్య చెప్పిన సమాధానాలే కొంచెం గందరగోళంగా ఉన్నాయి. ఇంతకీ శ్రీ లీల అడిగిన ప్రశ్నలు ఏమిటంటే.. మీరు నటించిన సినిమాలలో మీకు బాగా నచ్చిన సినిమా ఏది అని అడిగింది.

అయితే అందుకు బాలయ్య తిన్నగా సమాధానం చెప్పకుండా తనదైన స్టైల్ లో నాకు నచ్చిన సినిమాలు చాలా మటుకు ఫెయిల్ అయ్యాయి, అలాగని హిట్ అయిన ప్రతి సినిమా నాకు నచ్చినది కాదు. కొన్ని ముహూర్త బలం బాగోలేక ఫెయిల్ అయిపోయాయి. అంతమాత్రాన ఆ సినిమాలు తక్కువేమీ కాదు అంటూ పొంతన లేని సమాధానం చెప్పాడు బాలయ్య. ఆఖరికి శ్రీలీల అడిగిన ప్రశ్నకి సమాధానం మాత్రం స్ట్రెయిట్ గా చెప్పలేదు.

అలాగే నేటి తరంలో మీకు బాగా నచ్చిన హీరో హీరోయిన్లు ఎవరు అని స్త్రీలీల అడిగిన ప్రశ్నకు కూడా తిన్నగా సమాధానం చెప్పలేదు బాలకృష్ణ. ఎవరి జోనర్లలో వాళ్ళు బాగానే చేస్తున్నారు, అలాగని నా జోనర్ వేరు. నాదంతా హై పవర్ వాళ్ళ పాత్రలలోకి నేను చొరబడలేను, అలాగే నా జోనర్ లోకి వాళ్ళు కూడా రాలేరు అంటూ పొంతన లేని సమాధానం చెప్పాడు బాలయ్య. అడిగినదానికి తిన్నగా సమాధానం చెప్తే బాలయ్య ఎందుకు అవుతాడు అంటూ నేటిజెన్సు సెటైర్లు వేస్తున్నారు. ఇప్పుడు బాలయ్య మాటలు తెగ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -