Balakrishna: తండ్రి ఎన్టీఆర్ కారణంగా కోట్ల రూపాయిలు నష్టపోయిన బాలకృష్ణ.. ఆ సంస్థను మూసేయడానికి అసలు కారణమిదా?

Balakrishna: మాములుగా సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సార్లు ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసిన చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్స్ గా నిలుస్తూ ఉంటాయి. ఇలా చిన్న హీరోల విషయంలో మాత్రమే కాకుండా పెద్దపెద్ద హీరోల విషయంలో కూడా జరిగింది. అలా టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ విషయంలో జరిగింది. ఆయన తండ్రి దివంగత హీరో నందమూరి తారకరామారావు సినిమాల్లో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించి కోట్లాది మంది అభిమానుల ఆదరాభిమానాలు సంపాదించుకున్నారు.

సినిమాలలో సక్సెస్ అవ్వడంతో పాటు రాజకీయ అరంగేట్రం చేసి కేవలం 8 నెలలు లోపే ప్రభుత్వాన్ని స్థాపించి ముఖ్య మంత్రి అయ్యాడు. నాడు ఆయన స్థాపించిన తెలుగు దేశం పార్టీ, నేటికీ ఉన్నత స్థాయిలోనే ఉంది. అలా ఎన్టీఆర్ కెరీర్ లో ఎన్నో విజయాలతో పాటు, ఎన్నో పరాజయాలు అవమానాలు కూడా ఉన్నాయి. కానీ బాలయ్య ఎక్కువగా ఎన్టీఆర్ వైభోగం గురించి చూపిస్తూ ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలను చేసాడు.

కాగా ఈ రెండు సినిమాలు ఘోరమైన డిజాస్టర్స్ గా నిలిచాయి. ఈ సినిమాలో కేవలం ఆయన తన తండ్రి ఎన్టీఆర్ పాత్రని పోషించడమే కాదు, నిర్మించాడు కూడా. మొదటి భాగం 75 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేస్తే, కేవలం 15 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఇక రెండవ భాగం కి అయితే సున్నా షేర్స్ వచ్చాయి.

డబ్బులు బాగా నష్టపోవడం తో బాలయ్య ఈ సినిమాలతోనే తన ప్రొడక్షన్ కంపెనీని కూడా మూసేసాడు. అలా తండ్రి జీవిత చరిత్రతో సినిమాలు తీసి ప్రొడక్షన్ కంపెనీని మూసేసిన ఏకైక హీరోగా బాలయ్య బాబు రికార్డుకెక్కాడు. ఈ సినిమాలలో ఎన్టీఆర్ వైభోగంతో పాటుగా ఆయన పరాజయాలు, ఎదురుకున్న అవమానాలను కూడా చూపించి ఉంటె మంచి ఎమోషనల్ గా ఉండేది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -