Balakrishna: రవితేజ, నాని కంటే బాలయ్య రెమ్యునరేషన్ ఎక్కువా.. ఎంత తీసుకుంటున్నారో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Balakrishna: మాములుగా సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ లు, దర్శక నిర్మాతలు సినిమా సక్సెస్ అయ్యింది అంటే చాలు వెంటనే రెమ్యూనరేషన్ లను పెంచేస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో తెలుగు హీరోల రెమ్యూనరేషన్ లు చాలా ఫాస్ట్ గా పెరుతున్న సంగతి తెలిసిందే. కొందరు సినిమా ఫ్లాప్ అయినా కూడా పారితోషికాన్ని పెంచేస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతున్న బాలయ్య రెమ్యూనిరేషన్ మాత్రం ఎందుకు పెరగదు? అఖండ సినిమా విడుదల కాకముందు వీరసింహారెడ్డి ఓకె చేసారు.

అప్పటికి జస్ట్ 10 కోట్లు మాత్రమే పారితోషికం. అఖండ హిట్ కావడంతో వీరసింహారెడ్డి రెమ్యూనిరేషన్ 14కు పెరిగింది. అప్పటికే ఒప్పుకున్న సినిమా భగవంత్ కేసరి. దానికి అప్పటికి 14 కి ఒప్పుకున్నారు. వీరసింహారెడ్డి తరువాత దాన్ని 18 కోట్లకు ఫైనల్ చేసారు. ఇప్పుడు లేటెస్ట్ గా చేయబోతున్న సినిమా బాబీ డైరక్షన్ లో ఆ సినిమా కు రెమ్యూనిరేషన్ 28 కోట్లు అని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. బాలకృష్ణకు 28 కోట్లు రెమ్యూనిరేషన్ అన్నా నిర్మాతలు హ్యాపీనే. ఎందుకంటే బాలయ్యకు సరైన డైరక్టర్ కాంబినేషన్ పడితే 150 కోట్లకు పైగానే బిజినెస్ వుంటుంది. కానీ కనీసం 150 కోట్ల మేరకు బిజినెస్ లేని చాలా మంది హీరోలు తెలుగులో 25 కోట్ల మేరకు రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నారు.

సీనియర్ హీరోల్లో పవన్ కళ్యాణ్ 60 కోట్లకు పైగానే తీసుకుంటున్నారు. మెగాస్టార్ 50 కోట్ల మేరకు తీసుకుంటున్నారు. తరువాత ప్లేస్ ఇప్పుడు బాలయ్య చేరారు. ఆ తరువాత రవితేజ 24 కోట్ల రేంజ్ లో ఉన్నారు. వెంకీ 10 కోట్ల దగ్గర వున్నారు. నాగ్ ఇంకా 10లోపులే వున్నారు. కానీ ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీకీ ఎంట్రీ ఇస్తున్న హీరోలు ఒకటి రెండు సినిమాలకే రెమ్యూనరేషన్ లను అమాంతం పెంచేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Revanth Reddy Challenges KTR: నువ్వు మొగోడివైతే ఒక్క సీటైనా గెలిచి చూపించు.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

CM Revanth Reddy Challenges KTR: బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జన జాతర పేరిట నిర్వహించినటువంటి...
- Advertisement -
- Advertisement -