Balakrishna: మూడు సినిమాలతో రూ.500 కోట్లు.. స్టార్ హీరో బాలకృష్ణ రేంజ్ మామూలుగా లేదుగా!

Balakrishna: టాలీవుడ్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఒక సినిమా ఇంకా విడుదల కాకముందే మరొక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్నారు బాలయ్య బాబు. ఈ మధ్యకాలంలో వరుసగా బాలయ్య విజయాలను అందుకుంటున్నారు. బాలయ్య గత సినిమాలు అఖండ, వీరసింహారెడ్డి 150 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించిన విషయం తెలిసిందే.

తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన భగవంత్ కేసరి సినిమా ఫుల్ రన్ లో దాదాపు 200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సులువుగా సాధించే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలా బాలయ్య బాబు లేటెస్ట్ మూడు సినిమాల కలెక్షన్లు 500 కోట్ల రూపాయలకు అటూ ఇటుగా ఉండనున్నాయని అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్. అలా ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాలయ్య బాబు హవా నడుస్తోంది. రాబోయే రోజుల్లో బాలయ్య మరిన్ని విజయాలను సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ ఫీలవ్వడంతో పాటు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

బాలయ్య ప్రాజెక్ట్ లు వరుసగా సక్సెస్ సాధిస్తుండగా బాలయ్యతో సినిమాలు తెరకెక్కించడానికి చాలామంది దర్శకనిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. బాలయ్య రెమ్యునరేషన్ పెరుగుతుండగా ఆరు పదుల వయస్సులో కూడా బాలయ్య ఎనర్జీ లెవెల్స్ తగ్గడం లేదు. బాలయ్య కామెడీ టైమింగ్ కూడా భగవంత్ కేసరి సినిమాకు హైలెట్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే. కాగా బాలయ్య బాబీ కాంబో మూవీ నెక్స్ట్ లెవెల్ లో తెరకెక్కుతుండగా వచ్చే ఏడాది సెకండాఫ్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది.

బాలయ్య మల్టీస్టారర్ సినిమాలలో నటిస్తే బాగుంటుందని మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే బాలయ్య బాబు ఆరు పదుల వయసులో కూడా వరుసగా సినిమాలలో నటిస్తూ ఈ తరం హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు. ఎంతోమంది యంగ్ హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్నారు బాలయ్య బాబు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -