Bhagavanth Kesari: బాలయ్యకు కూతురు కాదు కోడలా.. బాలయ్య శ్రీలీల మధ్య ఉన్న బంధం అలాంటిదేనా?

Bhagavanth Kesari:  డైరెక్టర్ అనిల్ రావిపూడి – నందమూరి బాలయ్య కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా భగవంత్ కేసరి. ఇక ఈ సినిమా గురించి ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పటినుంచి నందమూరి అభిమానులు ఈ సినిమా గురించి ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారని చెప్పాలి. పైగా ఇందులో ఇద్దరు ముద్దుగుమ్మలైన కాజల్ అగర్వాల్, శ్రీలీల లు కూడా నటించటంతో ప్రేక్షకులు ఈ కాంబినేషన్ కోసం మరింత ఎదురుచూస్తున్నారు.

అయితే మొన్నటిదాకా ఈ సినిమాకు సంబంధించిన పలు అప్డేట్లు ప్రేక్షకులలో బాగా ఆశలు పెంచాయి. అంతేకాకుండా శ్రీ లీల బాలయ్య కూతురుగా కనిపిస్తుందని వార్త బాగా వైరల్ అయింది. దీంతో ప్రేక్షకులు ఈ సినిమాలో బాలయ్య, శ్రీ లీల మధ్య బాండింగ్ ఎలా ఉంటుందా అని అంచనాలు పెంచుకున్నారు. అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ప్రస్తుతం యూట్యూబ్లో ఆ ట్రైలర్ వీడియో ట్రెండింగ్ లో ఉందని చెప్పాలి.

నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకులకు కూడా ఈ సినిమా ట్రైలర్ బాగా నచ్చింది. మాస్ అండ్ ఎమోషనల్ కాంబినేషన్లో వచ్చిన ట్రైలర్ చూసి ప్రేక్షకులు సినిమా విడుదల వరకు ఆగట్లేరని చెప్పాలి. అయితే శ్రీ లీల, బాలయ్య తండ్రి కూతుర్ల కాంబినేషన్లో కనిపిస్తున్నారన్న వార్త నిజం కాదని నిన్నటి ట్రైలర్లో అర్థమైంది. అయితే అసలు విషయం ఏంటంటే..

శ్రీ లీల బాలయ్యకు కూతురు కాదని.. మేనకోడలని తెలుస్తుంది. శ్రీ లీల తండ్రి శరత్ కుమార్ ఆర్మీ ఆఫీసర్. అయితే ఈయన మరణించడంతో.. శ్రీ లీల బాధ్యతలు మేనమామగా బాలయ్య తీసుకుంటాడు. అంతేకాకుండా తన బావ చివరి కోరిక తీర్చడానికి తన మేనకోడలిని మిలిటరీలో చేర్చటానికి బాలయ్య బాగా కష్టపడుతున్నట్లు ఆ ట్రైలర్ లో కూడా కనిపించింది. అలా మేనకోడలిని ఆర్మీ ఆఫీసర్ గా చేయటానికి మేనమామగా బాలయ్య ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక ఈ సినిమా కూడా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవటం ఖాయమని ట్రైలర్ చూసిన ప్రేక్షకులు అంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -