Harikrishna: హరికృష్ణ ఫ్లాప్ సినిమాకు బాలయ్య అనిల్ కాంబో మూవీ రీమేకా.. అయ్యో అనేలా?

Harikrishna: టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా నటించిన చిత్రం భగవంత్ కేసరి. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయినా పోస్టర్ లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది. మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించి కొన్ని పుకార్లు సోషల్ మీడియాలో ఊపందుకున్నాయి.

ఈ సినిమా ఓ అనధికారిక రీమేక్ అనేది ప్రస్తుతం నడుస్తున్న రూమర్. దీంతో ఈ విషయంపై తాజాగా మూవీ మేకర్స్ స్పందించారు. హరికృష్ణ హీరోగా 19 ఏళ్ల కిందట స్వామి అనే సినిమా వచ్చింది. ఆ సినిమా స్ఫూర్తితోనే భగవంత్ కేసరి సినిమాను తెరకెక్కిస్తున్నారనే రూమర్స్ మొదలయ్యాయి. ఆ వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టడంతో వెంటనే మూవీ మేకర్ స్పందించారు. భగవంత్ కేసరి స్ట్రయిట్ మూవీ అని క్లారిటీ ఇచ్చింది. భోళాశంకర్ తో ఈ నిరసన మరింత ఎత్తుకు చేరింది.

 

ఇలాంటి టైమ్ లో భగవంత్ కేసరి కూడా రీమేక్ అనే ప్రచారం మొదలయ్యేసరికి నందమూరి ఫ్యాన్స్ టెన్షన్ పడ్డారు. నిర్మాతలు క్లారిటీ ఇవ్వడంతో కుదుటపడ్డారు. దసరా పండుగ కానుకగా ఈ సినిమా విడుదల కానున్న విషయం తెలిసిందే. బాలయ్య గత సినిమా వీర సింహారెడ్డి బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా తప్పకుండా సూపర్ హిట్ అవుతుందని నందమూరి అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ బాలయ్య బాబు అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -