NTR: తారక్ కష్టం గురించి తెలిస్తే ఫ్యాన్స్ కన్నీళ్లు పెట్టాల్సిందే!

NTR: టాలీవుడ్ లో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించిన స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్. నందమూరి నట వారసుడిగా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన తారక్.. అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించాడు. ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమాతో తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టిన తారక్.. ‘ఆర్ఆర్ఆర్’తో తనలోని నట విశ్వరూపాన్ని ప్రపంచానికి చూపించాడు.

 

 

తాజాగా ఈ సినిమాలోని ‘నాటునాటు’ పాటుగాను ఏకంగా గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంతో.. యావత్ ప్రపంచం వేదిక మీద తెలుగు సినిమా బావుటా ఎగిరింది. ఆ సినిమాలో హీరోలు రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు ఇరగదీయడం తెలిసిందే. ప్రస్తుతం ఈ అవార్డుల ఫంక్షన్ కోసం విదేశాల్లో ఉన్న ఎన్టీఆర్ గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముఖం మీద ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే ఎన్టీఆర్.. ఎంతో దు:ఖాన్ని ఆపుకొని అలా నవ్వుతున్నాడని సన్నిహితులు చెప్పే మాట.

 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పైకి మాత్రమే నవ్వుతుంటాడని, లోలోపల ఎంతో దు:ఖాన్ని దిగమింగుతున్నాడనే విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇందుకు కారణం తారక్ తన తండ్రిని కోల్పోవడమే అని అంటున్నారు. తారక్ తండ్రి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడంతో అతడు ఎంతో కుంగిపోయాడని, తన చేతిని పట్టుకొని నడిపించే తోడు, ధైర్యాన్ని కోల్పోయినట్లు ఎన్టీఆర్ చాలా బాధపడుతుంటాడట.

 

ఇప్పటికీ నిద్ర లేచిన వెంటనే తన తండ్రి హరికృష్ణ ఫోటోకు దండం పెట్టడం, నిద్రపోయే ముందు తన తండ్రికి నమస్కారం పెట్టి పడుకోవడం ఎన్టీఆర్ చేస్తుంటాడట. తన తండ్రిని ఎప్పుడు తలుచుకున్నా ఎన్టీఆర్ కు దు:ఖం ముంచుకొస్తుందట. తన తండ్రి గుర్తుకు వస్తే ఒంటరిగా రూంలోకి వెళ్లి, తలుపులు వేసుకొని వెక్కివెక్కి ఏడుస్తాడట.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: ఉప్మాకు అమ్ముడుపోవద్దంటూ పవన్ కళ్యాణ్ సెటైర్లు.. ఆ ఉప్మా ఎవరంటే?

Pawan Kalyan:  ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పవన్ కళ్యాణ్ తన ప్రచారం లో జోరు, ప్రసంగాలలో హోరు పెంచుతున్నారు. తనదైన స్టైల్ లో ప్రతిపక్షం వారిని విమర్శిస్తూ కూటమి అధికారంలోకి వస్తే...
- Advertisement -
- Advertisement -