NTR: వామ్మో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఇన్ని అవమనాలు జరిగాయా?

NTR: నందమూరి యువహీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్లోబర్ స్టార్ అయ్యాడు. ఆర్ఆర్ఆర్ మూవీతో ఆయనకు ఆ రేంజ్ వచ్చింది. ప్రస్తుతం తారక్ టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్5 హీరోలలో ఒకరనే సంగతి తెలిసిందే. ఇక పాన్ ఇండియా మూవీలపై ఫోకస్ పెట్టాడు. అయితే ఈ స్థాయికి వచ్చేంత వరకు ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి.

 

మెుదటి నుంచి జూనియర్ సినిమా ఎంపిక బాగుంది. మెుదటి సినిమాతోనే తన సత్తా చూపించాడు. ఏక సంతాగ్రహుడిగా పేరు తెచ్చుకున్నాడు. కానీ ఆది, సింహాద్రి సినిమాలు విజయం సాధించే వరకు హరికృష్ణ మినహా నందమూరి కుటుంబం నుంచి మరెవరూ ఎన్టీఆర్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వలేదు. 2014 సంవత్సరం ఎన్నికల ఫలితాలు వెలువడడానికి కొన్ని నెలల ముందు ప్రముఖ న్యూస్ ఛానల్ లో ఎన్టీఆర్ ను అవమానించేలా 20 నిమిషాల నిడివి ఉన్న వీడియో టెలికాస్ట్ అయ్యింది. అది పెనుదుమారమే లేపింది.

ఇక సినిమాల్లో హిట్లు, ప్లాప్ లు సహజం కదా. ఎన్టీఆర్ కు కూడా ఇలాంటి సందర్భాలు ఎదురయ్యాయి. వరుసగా ఫ్లాప్స్ వచ్చిన సమయంలో తారక్ పని అయిపోయిందని కూడా కొన్ని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. కానీ ఆ తర్వాత అదిరిపోయే హిట్ లు ఫ్యాన్సుకు ఇచ్చాడు.

 

మరోవైపు అభిమానులకు ఓ కోరిక బలంగా ఉంది. అదే రాజకీయ రంగ ప్రవేశం. అభిమానులు తారక్ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నా ఎన్టీఆర్ మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కొంతమంది ప్రతిపక్ష పార్టీ నేతలు తారక్ ఏం మాట్లాడినా వివాదాస్పదం చేస్తున్నారు.అయితే తనకు ఎన్ని అవమానాలు ఎదురైనా తారక్ సైలెంట్ గా ఉంటున్నారే తప్ప వాటి గురించి నోరు మెదపడానికి ఇష్టపడటం లేదు.

 

2024 ఎన్నికల్లో టీడీపీ తరపున తారక్ ప్రచారం చేస్తారని వినిపిస్తున్నా తారక్ ఆ కామెంట్ల గురించి స్పందించడం లేదు.జూనియర్ ఎన్టీఆర్ కు మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువని కెరీర్ పరంగా ఏ పొరపాటు జరగకుండా ఆచితూచి అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -