Balayya: బాలయ్య నిర్ణయానికి కాళ్లు మొక్కాల్సిందే.. ఆయన ఏం చేశారంటే?

Balayya: నందమూరి తారకరత్న ఇటీవలే గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఆయన మరణాన్ని నందమూరి కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఇక ఆయన చనిపోయి 15 రోజులు కావోస్తూ ఉండగా.. ఈయన చనిపోయినప్పటి నుంచి ఈయనకి సంబంధించిన వార్తలు రోజు వినిపిస్తూనే ఉన్నాయి.

 

ఆయన పెళ్లి, కెరీర్ విషయాల గురించి చాలా వార్తలు వచ్చాయి. ఇక తారకరత్న కుటుంబ సభ్యులను ఎదిరించి పెళ్లి చేసుకోవడం వల్ల అప్పటినుంచి ఆయన తన కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్నాడు. అలా నందమూరి కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్నా కూడా.. ఎన్టీఆర్, బాలయ్య మాత్రం ఆయనను దగ్గరికి తీసుకున్నారు.

బాలయ్యకు తారకరత్న అంటే చాలా ఇష్టం. తారకరత్నకు కూడా బాలయ్య అంటే అంతే ప్రాణం. ఇక తారకరత్నను గుండెపోటుతో ఆసుపత్రిలో చేర్చినప్పటి నుంచి ఇప్పటివరకు బాలయ్యనే దగ్గరుండి అన్ని బాధ్యతలు చేపట్టాడు. ఇక తారకరత్న భార్య పిల్లల బాధ్యతలు కూడా బాలయ్య చూసుకుంటానని మాట ఇచ్చాడు.

 

తారకరత్న చనిపోక ముందు.. ఓ సినిమాలో విలన్ పాత్రలో చేసిన సంగతి తెలిసిందే. ఇక హీరోగా కాకుండా విలన్ గా ఆయనకు బాగా కలిసి రావటంతో కొందరు దర్శకులు ఈయనను తమ సినిమాలో తీసుకోవాలని అనుకున్నారు. ముఖ్యంగా బాలకృష్ణతో ఎన్.బి.కె 108 సినిమా చేస్తున్న అనిల్ రావిపూడి కూడా ఆ సినిమాలో తారకరత్నకు అవకాశం ఇవ్వాలని అనుకున్నట్టు తెలిసింది.

 

కానీ అంతలోని ఈ ఘటన జరిగిపోయింది. అయితే తాజాగా బాలకృష్ణ ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. తారకరత్న చనిపోయిన కూడా తన సినిమాలో తారకరత్నను చూపించాలని నిర్ణయించుకున్నాడట బాలయ్య. అది కూడా విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ ద్వారా తారకరత్నను చూపించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

 

గతంలో రాజమౌళి తన దర్శకత్వంలో రూపొందిన యమదొంగ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి సీనియర్ ఎన్టీఆర్ ను వి ఎఫ్ ఎక్స్ ఎఫెక్ట్స్ ద్వారా చూపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అటువంటిదే తారకరత్న విషయంలో బాలయ్య ఎన్బికె 108 లో సెట్ చేస్తున్నారని తెలిసింది. ఇక ఈ విషయం తెలియడంతో తారకరత్న అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య తీసుకున్న నిర్ణయానికి కాళ్ళు మొక్కాల్సిందే అంటూ పొగుడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -