Balayya Remuneration: వామ్మో.. బాలయ్య అన్ని రూ.కోట్ల పారితోషికం డిమాండ్ చేశారా?

Balayya Remuneration: నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినీ నటుడిగా, నిర్మాతగా, వ్యాఖ్యతగా తనదైన శైలిలో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన బాలయ్య.. ఇండస్ట్రీకి ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్ సినిమాలు అందించారు. తన తోటి నటుడు రిటైర్మెంట్ తీసుకున్నా.. బాలయ్య అదే దూకుడు ప్రదర్శిస్తున్నారు. కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్ లోనూ ఫుల్ జోష్ కనబరుస్తున్నారు. ‘అఖండ’ మూవీలో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన బాలయ్య.. ఈ సినిమా తర్వాత వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. అలాగే అన్‌స్టాపబుల్ షోలో హోస్ట్ గా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.

 

ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘వీరసింహారెడ్డి’ సినిమా చేస్తున్నారు. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులన్నీ పూర్తయ్యాయి. త్వరలో సినిమా షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత బాలయ్య ‘సర్కారు వారి పాట’ సినిమా డైరెక్టర్ పరుశురామ్‌ పెట్లాతో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాలో బాలయ్య పవర్‌ఫుల్ సీఎం క్యారెక్టర్‌లో కనిపించనున్నారు.

 

అయితే వరుస సినిమాల్లో దూసుకెళ్తున్న బాలయ్య.. తన రెమ్యునరేషన్ పెంచినట్లు తాజాగా సమాచారం అందింది. ఈ మధ్యకాలంలో బాలయ్య క్రేజ్ విపరీతంగా పెరిగింది. అన్‌స్టాపబుల్ షో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవ్వడం.. సినిమాల విషయంలోనూ అన్నీ హిట్ అవ్వడంతో.. బాలయ్య తన రెమ్యునరేషన్ పెంచినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి కంటే ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి ప్రస్తుతం రూ.35 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. కానీ బాలయ్య ఒక్క పాన్ ఇండియా మూవీలో నటించాలంటే రూ.40 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: అవినాష్ రెడ్డి ఏ తప్పు చేయలేదా.. అలా అయితే హత్య చేసిందెవరో చెప్పు జగన్?

CM Jagan:  ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల పులివెందులలో నిర్వహించినటువంటి సభలో వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నాన్న వివేకం బాబాయ్ కి...
- Advertisement -
- Advertisement -