Tarak: బాలయ్య తారక్ కాంబోలో మూవీ.. దర్శకుడెవరంటే?

Tarak: నందమూరి అభిమానులకు ఇప్పటికీ తీరని కోరికగా మిగిలింది “నందమూరి మల్టీస్టారర్ సినిమా”. అయితే అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలోనే అభిమానుల ఈ కోరిక తీరేలా కనిపిస్తున్నాయి పరిస్థితులు. ఇది వరకు చాలా వేదికల్లో నందమూరి మల్టి స్టారర్ మూవీ గురించి చర్చలు జరిగినా ఎలాంటి నిర్ణయం గాని, ప్రకటన గని రాలేదు. ఇక ప్రస్తుతం ఏ అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. నందమూరి నటసింహం బాలయ్య బాబు, నందమూరి యువకెరటం యంగ్ టైగర్ ఒకే స్క్రీన్ పై కనబడనున్నారు.

 

బాలయ్యబాబుతో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఓ కొత్త ప్రాజెక్టు చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నాడట. అయితే ఇప్పటికే బాలయ్య బోయపాటి కాంబోలో వచ్చిన సినిమాలు ఎలాంటి విజయాలు సాధించాయో మనకు తెలుసు. దానితో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇదిలా ఉండగా ఇక ప్రస్తుతం జరుగుతున్న చర్చ ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచుతున్నాయి. బాలయ్య బాబుతో పాటు సినిమాలో ఒక ప్రత్యేక పాత్రను బోయపాటి సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడట. ఆ ప్రత్యేక పాత్ర గురించే ఇప్పుడు చర్చ అంతా.

 

బోయపాటి బాలయ్య మూవీలో రూపొందించే ప్రత్యేక పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటించనున్నాడని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే నిజమైతే నందమూరి అభిమానులకు అది పెద్ద పండగే. అంతేకాదు ఈ ఇద్దరు పవర్ యాక్టింగ్ హీరోలు ఒకేసారి స్క్రీన్ పై కనిపిస్తే మాములుగా ఉండదు. మొత్తానికి వీరిద్దరూ కలిసి ఒకేసారి తెరపై కనిపిస్తే నందమూరి అభిమానుల ఆశ తీరనుంది.

అయితే బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బాలయ్య హీరోగా తెరకెక్కనున్న ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో తారక్ కనిపిస్తారని ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం అందుతున్నా దీనిపై ఇంకా ఎలాంటి అఫీసియల్ ప్రకటన రాలేదు. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే ఇంకా వేచి చూడక తప్పదు. ప్రస్తుతం బాలయ్య వీరసింహారెడ్డి సంక్రాంతి బరిలో దూకడానికి సిద్ధంగా ఉండగా.. తారక్ కొరటాల దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -