Balayya: బాలయ్య వర్సెస్ దీపికా రెడ్డి.. ఈమె గెలిస్తే మాత్రం బాలయ్య పరువు గోవింద!

Balayya: నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంటు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఈయన సినీ నటుడిగా మాత్రమే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. 2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు.

ఇక 2019 ఎన్నికలలో కూడా హిందూపురం నియోజకవర్గం లో పోటీ చేసిన బాలకృష్ణ అత్యధిక మెజార్టీతో గెలిచి వైసిపి నేతలకు షాక్ ఇచ్చారు. ప్రస్తుతం హిందూపురం ఎమ్మెల్యేగా బాలకృష్ణ కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే వచ్చే ఎన్నికలలో బాలయ్యను ఓడించడం కోసం వైసిపి పెద్ద వ్యూహాలనే రచిస్తున్నారని తెలుస్తుంది అయితే ఇదంతా కూడా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో జరుగుతున్నట్టు సమాచారం.

 

గత ఎన్నికలలో బాలకృష్ణకు ఆపోజిట్ గా మాజీ ఐపిఎస్ అధికారి ఇక్బాల్ హిందూపురం నుంచి పోటీచేసి బాలయ్య చేతిలో ఓడిపోయారు. దీంతో హై కమాండ్ తనకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. అంతేకాకుండా నియోజకవర్గ ఇన్చార్జిగా కూడా వ్యవహరించారు. జగన్మోహన్ రెడ్డి ఇన్‌ఛార్జ్‌లతో సమీక్షా సమావేశం నిర్వహించినప్పుడు దానికి ఇక్బాల్‌కి ఆహ్వానం రాలేదు! కానీ దీపికా రెడ్డికి ఆహ్వానం రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

 

దీపిక రెడ్డికి ఆహ్వానం అందడమే కాకుండా ప్రస్తుతం హిందూపురం నియోజకవర్గానికి ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు.దీంతో వచ్చే ఎన్నికలలో దీపికా రెడ్డి బాలయ్య పై పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఇలా పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి నాయకుడిని రంగంలోకి దింపి బాలయ్య పై గెలిస్తే వచ్చే కిక్కు కన్నా పెద్దగా ఎవరికి తెలియని దీపికా రెడ్డిని రంగంలోకి దింపి బాలయ్య పై గెలుపు సాధిస్తే వచ్చే కిక్కు వేరని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే బాలయ్య చేతిలో దీపిక ఓడిపోయిన పెద్దగా బాధపడాల్సిన అవసరం కూడా ఉండదు మరి వచ్చే ఎన్నికలలో బాలయ్య విజయం సాధిస్తారా లేక దీపిక విజయం సాధిస్తారా అన్నది ఉత్కంఠతగా మారింది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -