Balayya: బాలయ్య ఫ్యాన్స్ కు శివతాండవమే.. బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ?

Balayya: సాధారణంగా సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు పెద్ద ఎత్తున సినిమాలు నువ్వా నేనా అంటూ పోటీపడుతూ సంక్రాంతి బరిలో దిగుతుంటాయి. ఇలా సంక్రాంతి బరిలో పెద్ద ఎత్తున సినిమాలు థియేటర్లలో ప్రేక్షకులను సందడి చేస్తుంటాయి. ఇకపోతే వచ్చేయడాది సంక్రాంతి బరిలో కూడా ఇలాంటి పోటీని ఏర్పడుతుందని తెలుస్తుంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ సినిమాలు రెండు కూడా సంక్రాంతి కానుకగా రావడంతో ఇద్దరి అభిమానుల మధ్య పెద్ద ఎత్తున పోటీ వాతావరణం ఏర్పడింది.

 

ఈ విధంగా బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవి ఇద్దరు నటించిన సినిమాలను ఒకే నిర్మాణ సంస్థ నిర్మించడంతో ఈ సినిమాలపై మరింత ఆసక్తి నెలకొంది. ఇక బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా మరో లెవెల్ లో ఉండబోతుందని ఈ సినిమాలో విలన్ దునియా విజయ్ మేనమామ పాత్రలో నటించిన అజయ్ ఘోష్ వీర సింహారెడ్డి సినిమాకి మొదటి రివ్యూ ఇచ్చారు.

ఈ సినిమాలో తాను దునియా విజయ్ కి మేనమామగా ఒక కన్నింగ్ విలన్ గా ఎంపీ పాత్రలో కనిపిస్తానని తెలిపారు.ఇక ఈ సినిమాలో దర్శకుడు గోపీచంద్ ప్రతి ఒక్కరి పాత్రను మలిచిన తీరు ఎంతో అద్భుతంగా ఉందని, తప్పకుండా సంక్రాంతి బరిలో బాలయ్య సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందంటూ ఈయన తెలిపారు.

ఇక ఈ సినిమాలో బాలయ్య తన విశ్వరూపం చూపించారని, థియేటర్లో ఈ సినిమా చూసే ప్రేక్షకులకు శివతాండవమే అంటూ అజయ్ ఘోష్ మొట్టమొదటిసారి బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాకు రివ్యూ ఇచ్చారు.ఇలా బాలయ్య సినిమాకు బ్లాక్ బస్టర్ రివ్యూ ఇవ్వడంతో నందమూరి అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నారని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -