Bandi Sanjay: రాజకీయ చర్చలకు దారితీస్తున్న ఎన్టీఆర్ అమిత్ షా భేటీ?

Bandi Sanjay: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆదివారం తెలంగాణలో పర్యటించిన విషయం మనకు తెలిసిందే ఈ క్రమంలోనే ఈయన నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు అపాయింట్మెంట్ ఇచ్చి తనని లంచ్ కి ఆహ్వానించిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ విషయం తెలియడంతో ప్రతి ఒక్కరిలోనూ వీరిద్దరి భేటీ వెనుక ఉన్న కారణం ఏంటి అని ఆరా తీశారు. ఇలా ఉన్నఫలంగా అమిత్ షా ఎన్టీఆర్ ను భేటీ కావడంతో ఎన్నో రాజకీయ చర్చలకు దారి తీసింది.

ఎన్టీఆర్ రాజకీయాలలోకి రావాలని ఎంతోమంది అభిమానులు కోరినప్పటికీ ఈయన రాజకీయాల్లోకి మాత్రం అడుగు పెట్టలేదు. ఇలా రాజకీయాలతో సంబంధం లేనటువంటి ఎన్టీఆర్ ను అమిత్ షా కలవడంపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక అమిత్ షా ఆహ్వానం మేరకు ఎన్టీఆర్ హైదరాబాదులోని నోవాటెల్ హోటల్ లో ఆయనను కలిశారు.

ఇక నోవాటెల్ హోటల్ కి వచ్చిన ఎన్టీఆర్ ను బిజెపి నేత బండి సంజయ్ మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు స్వాగతం పలికారు. ఈ విధంగా బండి సంజయ్ ఎన్టీఆర్ తో ఇంత సఖ్యతగా మెలగడం పట్ల ఈ భేటీ వెనుక ఏదో రాజకీయ కుట్ర ఉందని అందరూ సందేహం వ్యక్తం చేస్తున్నారు.అయితే గత కొద్ది రోజుల క్రితం బండి సంజయ్ ఎన్టీఆర్ ను ఉద్దేశించి పెద్ద ఎత్తున సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన RRR సినిమా విడుదలకు ముందు ఎన్టీఆర్ ముస్లిం పాత్రలో టోపీ పెట్టుకుని కనిపించడంతో ఈయన ఈ విషయంపై స్పందిస్తూ సినిమాని విడుదల చేయకుండా ఆపుతామని, థియేటర్లను తగలబెడతామంటూ పెద్ద ఎత్తున వార్నింగ్ ఇచ్చారు. అప్పట్లో ఈ ఇష్యూ కాస్త వైరల్ అయింది. ఈ విధంగా అప్పుడు ఎన్టీఆర్ కి వార్నింగ్ ఇచ్చిన బండి సంజయ్ ఇప్పుడు ఎన్టీఆర్ ను ఇలా అభినందించడం వెనుక పెద్ద రాజకీయ కుట్ర ఏదో ఉందని రాజకీయ లబ్ధి కోసమే అమిత్ షా ఎన్టీఆర్ ను భేటీ అయ్యారు అంటూ వార్తలు వస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -