Jagan-Sharmila: జగన్ మోసాన్ని వివరించబోతున్న షర్మిల.. తర్వాత ప్లాన్ ఇదేనా?

Jagan-Sharmila: ఆంధ్రప్రదేశ్లో మరొక నెల వ్యవధిలోకి ఎన్నికల నోటిఫికేషన్ వెలబడునున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో రాబోతున్నటువంటి తరుణంలో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల హడావిడి కొనసాగుతోంది అన్ని పార్టీ నేతలు అభ్యర్థులను ప్రకటిస్తూ ప్రజలలోకి వెళ్లి పార్టీ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే వైయస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో భేటీ అవడం కోసం ఎదురుచూస్తున్నారని తెలుస్తోంది.

 

అమిత్ షా తనకు అపాయింట్మెంట్ ఇవ్వడమే ఆలస్యం వెంటనే జగన్ రెడ్డి ఢిల్లీ వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి కంటే ముందుగానే షర్మిల ఢిల్లీలో వాలిపోతారని సమాచారం. ఈమె అమిత్ షా తో పాటు మోడీ అపాయింట్మెంట్ కూడా తీసుకోబోతున్నారని తెలుస్తోంది. ఢిల్లీ చేరుకున్న షర్మిల జంతర్ మంతర్ లో ప్రత్యేక హోదా దీక్ష చేయబోతున్నారని తెలుస్తోంది.

పేరుకే ఈమె ప్రత్యేక హోదా కోసం దీక్ష చేస్తున్నారని కానీ ఈమె ఢిల్లీ వెళ్లడం వెనుక మరో కారణం ఉందని తెలుస్తుంది. ఎన్నికల త్వరలో రాబోతున్నటువంటి తరుణంలో బిజెపి పార్టీ సహాయం తీసుకోవడం కోసమే జగన్ రెడ్డి అమిత్ షా ని కలవబోతున్నారు కానీ తనకు ఎలాంటి సహాయం చేయకూడదని ఆయన కుటుంబానికి చేసినటువంటి నమ్మకద్రోహం గురించి వివరించడానికి షర్మిల ఢిల్లీ వెళ్లారని సమాచారం.

 

ఇటీవల ఎన్నికల సంఘం కాస్త కఠినంగా వ్యవహరిస్తోంది. షెడ్యూల్ ప్రకటన తర్వాత విశ్వరూపం చూపిస్తుందని.. అందుకే వచ్చే ఎన్నికలలో బిజెపి సహాయం కోరడం కోసమే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పెద్దలను కలుస్తున్నారనీ షర్మిల భావిస్తున్నారు. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేయడం కోసం అన్ని పార్టీ నేతలు కలిసి రావడమే కాకుండా ఇప్పుడు షర్మిల కూడా తోడైందనే చెప్పాలి.

 

Related Articles

ట్రేండింగ్

YSRCP: మే ఒకటో తేదీనే ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు.. జగన్ మాయలు మామూలుగా లేవుగా!

YSRCP:  మే 1, బుధవారం ఉదయం గవర్నమెంట్ ఉద్యోగస్తులందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. తమ ఫోన్స్ కి వస్తున్న మెసేజ్లను చూసి ఏం జరిగిందో తెలియని అయోమయంలో పడ్డారు. అయితే అసలు విషయం...
- Advertisement -
- Advertisement -