Bandi Sanjay: బండి సంజయ్ చేసిన తప్పులివే.. ఆ తప్పులే ఆయనకు శాపంగా మారాయా?

Bandi Sanjay: ప్రస్తుతం ఏపీ తెలంగాణలో మారుమోగుతున్న పేరు.. బండి సంజయ్. తాజాగా తెలంగాణలో టెన్త్ పబ్లిక్ క్వశ్చన్ పేపర్ లీకేజీ లో బండి సంజయ్ హస్తం కూడా ఉంది అని తెలియడంతో ఆయనని పోలీసులు అరెస్టు చేయడంతో తెలంగాణలో ఉద్రిక్తత నెలకొంది. సంజయ్ రిమాండ్ రిజెక్ట్ చేయడానికి మెజిస్ట్రేట్ కూడా అంగీకరించలేదు. దీంతో ఖమ్మం జైలుకు వెళ్లక తప్పలేదు. పదవ తరగతి క్వశ్చన్ పేపర్ల లీకేజీకి కుట్ర పన్నారని పోలీసులు అరెస్ట్ చేసిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు హన్మకొండ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.

అర్థరాత్రి కరీంనగర్‌ లోని ఇంట్లో ఉన్న బండి సంజయ్‌ను అరెస్ట్ చేసిన హైదరాబాద్ తీసుకు వచ్చారు. తర్వాత మధ్యాహ్నం హన్మకొండ కోర్టులో ప్రవేశ పెట్టారు. రిమాండ్ రిపోర్టులో పేపర్ లీకేజీ కుట్ర పన్నారని అభియోగాలు నమోదు చేశారు. అయితే ఇదంతా రాజకీయ కుట్ర అని ఎంతో మంది ఫోన్లు చేస్తూ ఉంటారని అందులో కుట్ర ఉందని ఎలా అంటారని ఆయన తరపు న్యాయవాదులు కోర్టులో వాదించినా ప్రయోజనం లేకపోయింది. జడ్జి రిమాండ్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నిజానికి ఈ కేసులో బండి సంజయ్ ప్రమేయం ఉందని చెప్పడానికి పోలీసులు చూపించిన ఒకే ఒక్క కారణం నిందితుడు ప్రశాంత్ బండి సంజయ్‌కు ఫోన్ చేయడమే.

ఆయన మాజీ జర్నలిస్టు. చాలా మంది రాజకీయ నేతలతో సంబంధాలు ఉంటాయి. ఆయన పేపర్‌ను ఓ మీడియా గ్రూపుతో పాటు పలువురు బీజేపీ నేతలకు షేర్ చేశారు. అలా షేర్ చేసిన వారిలో ఈటల , బండి సంజయ్ ఉన్నారు. అయితే ఈ 10 పేపర్ల లీకేజీలో బండి సంజయ్ హస్తం ఉందా లేదా అన్న సంగతి పక్కన పెడితే కేవలం ఒక ఫోన్ కాల్ బండి సంజయ్ ని జైలుకు పంపించింది. కాగా గతంలో బండి సంజయ్ కేసిఆర్ కుటుంబాన్ని జైలుకు పంపిస్తామని అలాగే కవిత కోసం ఢిల్లీ జైలు రెడీ చేశామని ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. దీంతో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను మరోసారి తెరపైకి తీసుకువస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -