Kothapalli Geetha: కొత్తపల్లి గీత కులంపై రచ్చ.. అరకు బీజేపీలో ఆ అభ్యర్థికి భారీ షాక్ తగలనుందా?

Kothapalli Geetha: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున పలు నియోజకవర్గాలలో గొడవలు చోటు చేసుకుంటున్నాయి. వైఎస్ఆర్సిపి పార్టీ ఒంటరిగా పోటీ చేస్తూ ఉండగా మరోవైపు తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగబోతున్నాయి. ఈ క్రమంలోనే కూటమిలో భాగంగా కొన్ని నియోజకవర్గాలలో ఆశించిన వారికి టికెట్లు రాకపోవడంతో అభ్యర్థుల మధ్య ఆందోళన నెలకుంది.

ఇలాంటి వివాదాలు మన్యం జిల్లా అరకు నియోజకవర్గంలో కూడా చోటు చేసుకున్నాయని చెప్పాలి. అరకు బిజెపి ఎంపీ అభ్యర్థిగా కూటమిలో భాగంగా కొత్తపల్లి గీతకు సీటు కేటాయించారు అయితే ఈమెకు సీటు కేటాయించడానికి బిజెపి నేత నిమ్మక జయరాజు అగ్గి రాజేశారు. దీంతో ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వివాదాలు చోటు చేసుకుంటున్నాయి.

కొత్తపల్లి గీత అభ్యర్థిత్వాన్ని జయరాజు తీవ్రంగా ఖండించారు. అసలు ఈ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి ఆమె ఎస్టీనే కాదని ఆయన ఆరోపణలు చేశారు. ఈ ఎంపీ స్థానం నుంచి కొత్తపల్లి గీత కాకుండా మరెవరిని నిలబెట్టిన తాము సపోర్ట్ చేస్తామని అలా కాదని ఆమెని కేటాయిస్తే మాత్రం తమ దారి తాము చూసుకుంటామని ఈయన బెదిరింపులకు దిగారు.

కొత్తపల్లి గీతా పట్ల జయరాజు ఈ విధంగా చేసినటువంటి వ్యాఖ్యలపై ఆమె స్పందిస్తూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే జయరాజు పై చర్యలు ఉంటాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వివాదం చోటుచేసుకుంది.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -