Bandla Ganesh: మళ్లీ టంగ్ స్లిప్ అయిన బండ్ల గణేష్.. అల్లు ఫ్యామిలీపై!!

Bandla Ganesh: ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ మరోసారి టంగ్ స్లిప్ అయ్యాడు. ఓ ప్రైవేట్ ఫంక్షన్‌కి హాజరైన బండ్ల గణేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ ఈవెంట్‌కు అల్లు అరవింద్ పెద్ద కొడుకు అల్లు బాబీ కూడా వచ్చారు. అల్లు బాబీని పక్కన పెట్టుకుని సంచలన వ్యాఖ్యలు చేశాడు. దాంతో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్‌గా మారింది. సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటాడు బండ్ల గణేష్. ఏ విషయాన్ని దాచుకోకుండా ముక్కుసూటిగా చెబుతుంటారు. ‘గబ్బర్ సింగ్, టెంపర్, బాద్ షా’ వంటి సూపర్ హిట్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన బండ్ల గణేష్.. పలు ఇంటర్వ్యూల్లో ఆయన చేసిన కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా అల్లు బ్రదర్స్ పైనే సంచలన వ్యాఖ్యలు చేశాడు. బండ్ల గణేష్ టంగ్ కంట్రోల్‌లో ఉండదని పలువురు విమర్శలు చేస్తున్నారు.

 

 

ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ..‘దయచేసి తండ్రి మాట అసలు ఎవరూ వినకండి. తండ్రి మాట వింటూ పెరిగితే బాబీలా తయారవుతారు. తండ్రి మాట వినకుండా నచ్చినపని చేస్తే.. బన్నీలా స్టార్‌గా ఎదుగుతారు. బాబీలా తయారవుతారా? బన్నీలా మారుతారా? అనే విషయాన్ని మీరే నిర్ణయించుకోవాలి. అల్లు బాబీ చిన్నప్పటి నుంచి తండ్రి మాట వింటూ పెరిగారు. బుద్ధిగా చదువుకుంటూ అలాగే ఉన్నారు. కానీ అల్లు అర్జున్ ఎప్పుడూ తండ్రి మాట వినకుండా ఇష్టమొచ్చినట్లు పెరిగారు. తండ్రి మాట వినలేదు కాబట్టే.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. దీన్ని బట్టి చూస్తే.. ప్రతి ఒక్కరూ తమ లైఫ్‌కు సంబంధించి సొంత నిర్ణయాలు తీసుకోవాలి.’ అని బండ్ల గణేష్ వ్యాఖ్యలు చేశాడు. అయితే పరోక్షంగా అల్లు బాబీని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నట్లు పలువురు కామెంట్లు చేస్తున్నారు. అయితే బండ్ల గణేష్ కామెంట్స్ కి మాత్రం అల్లు బాబీ సరదాగా నవ్వుకున్నారు. కానీ నెటిజన్లు మాత్రం బండ్ల గణేష్‌పై మండిపడుతున్నారు. అన్నదమ్ముల్లో ఒకరిని పొగుడుతూ.. మరొకరిని కించపరుస్తూ మాట్లాడుతున్నట్లు పేర్కొన్నారు.

Related Articles

ట్రేండింగ్

Raghurama Krishnam Raju: రఘురామ కృష్ణంరాజు కల నెరవేరిందిగా.. ఉండి ఎమ్మెల్యేగా ఆయన విజయం పక్కా!

Raghurama Krishnam Raju: ప్రస్తుత నరసాపురం సిట్టింగ్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి నర్సాపురం ఎంపీగా గెలుపొందారు. ఇలా గెలిచిన కొద్ది రోజులకే పార్టీ పిఠాయించి తెలుగుదేశం చెంతకు చేరారు....
- Advertisement -
- Advertisement -