Ms Dhoni: ధోనికి షాకిచ్చిన బీసీసీఐ… ఎవ్వడైనా ఆ రూల్ పాటించాల్సిందే..!

Ms Dhoni: తాజాగా బీసీసీఐ భారత ఆటగాళ్లు విదేశీ లీగ్స్ ఆడే విషయంలో తమ నిర్ణయం మారదని స్పష్టం చేసింది. ఒకవేళ విదేశీ లీగ్స్ తో ఆడాలి అనుకుంటే తప్పకుండా భారత్ క్రికెట్ తో తెగతెంపులు చేసుకోవాలని సూచించింది. అలాగే అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌ కు కూడా వీడ్కోలు పలకాలని స్పష్టం చేసింది. అయితే ఈ నిర్ణయం ఎంతటి పెద్ద ఆటగాడికి అయినా ఈ నిబంధన వర్తిస్తుంది అని స్పష్టం చేసింది.

అయితే సౌత్ ఆఫ్రికా వేదికగా జరగనున్న టీ20 లీగ్‌లో ఐపీఎల్‌కు చెందిన ఫ్రాంచైజీలే అక్కడా జట్లను కొనుగోలు చేశాయి. దీంతో భారత ఆటగాళ్లను ఈ లీగ్‌‌కు అనుమతిస్తారు అంటూ ప్రచారాలు కూడా జరిగాయి. ఇక సౌత్ ఆఫ్రికా టి20 లీగ్ లో జోహన్నెస్ బర్గ్ సూపర్ కింగ్స్ జట్టును చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం కొనుగోలు చేసింది. అంతేకాకుండా ఆ జట్టుకు తమ కెప్టెన్ అయినా మహేంద్ర సింగ్ ధోని మెంటార్ గా నియమించాలి అని భావించింది. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ అనుమతిని కూడా కోరింది.

టీమ్ ఇండియా కెప్టెన్‌గా మూడు టైటిల్స్ అందించిన ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు కూడా గుడ్ బై చెప్పడంతో అతనికి అనుమతి లభించే అవకాశం ఉందంటూ కూడా ప్రచారం జరిగింది. అయితే కేవలం మెంటార్‌ గానే ఆ లీగ్‌ బరిలోకి దిగనున్నాడని కాబట్టి అతని అనుమతిని నిరాకరించకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు. కాగా బీసీసీఐ మహేంద్ర సింగ్ ధోనీకి షాక్ ఇచ్చింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -