Poonam: అలాంటి నాయకులతో జాగ్రత్త.. పూనమ్ సంచలన ట్వీట్ వైరల్!

Poonam: నటి పూనమ్ కౌర్ సినిమాలలో కన్నా సోషల్ మీడియా వేదికగా చేసే సంచలనమైనటువంటి పోస్టులు ద్వారా పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు అయితే ఈమె సినిమాలకు సంబంధించిన విషయాల గురించి మాత్రమే కాకుండా రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి కూడా సంచలన మైనటువంటి పోస్టులు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు అయితే ఈమె ఎవరిని ఉద్దేశించి ఆ పోస్ట్ చేశారన్న విషయం మాత్రం ప్రస్తావించకుండా పరోక్షంగా కొందరిని టార్గెట్ చేస్తూ పోస్టులు చేస్తుంటారు.

ఈ క్రమంలోనే ఆదివారం ఈమె మహిళలను ఉద్దేశిస్తూ చేసినటువంటి ట్వీట్ వైరల్ గా మారింది.అయితే ఈమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి ఈ పోస్ట్ చేశారని పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర స్థాయిలో ఈమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈమె చేసిన ఆ పోస్ట్ ఏంటి అనే విషయానికి వస్తే… స్త్రీల సమస్యలపై మహా శ్రద్ధ ఉన్నట్లు గొంతు చించుకొని అరుస్తున్న వీళ్ళు మహిళ రెజ్లర్ల కష్టాల గురించి ఒక్క మాటైనా కూడా మాట్లాడటం లేదు.

 

వారి స్వలాభం, సౌకర్యాలే ప్రధానమైన కుహనా నాయకులతో జాగ్రత్తగా ఉండండి అంటూ ఈమె ట్వీట్ చేశారు. అయితే ఈమె ఎవరిని ఉద్దేశించి చేశారనే విషయం గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈమె పరోక్షంగా పవన్ కళ్యాణ్ ఉద్దేశించే ఇలాంటి ట్వీట్ చేశారని స్పష్టంగా అర్థం అవుతుంది ఈమధ్య కాలంలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేస్తూ మహిళల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాలకు గురించి మాట్లాడుతున్నారు. అలాగే మహిళలు అక్రమ రవాణాకు వాలంటీర్లు కారణమంటూ కామెంట్స్ చేశారు.

 

ఈ విధంగా పవన్ కళ్యాణ్ మాత్రమే మహిళ సంరక్షణ గురించి పోరాటం చేస్తున్నట్టు మాట్లాడటంతో ఈమె పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని పవన్ కళ్యాణ్ అభిమానులు భావిస్తూ తీవ్ర స్థాయిలో నటి పూనమ్ కౌర్ పై మండిపడుతున్నారు. అయితే ఈమె ఈ ట్వీట్ చేసేటప్పుడు హ్యాష్ ట్యాగ్ ఆంధ్ర ప్రదేశ్ అని పేర్కొనడంతో కచ్చితంగా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసే ఇలాంటి కామెంట్స్ చేశారని అభిమానులు మండిపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -