Bichagadu 2: మణిరత్నం సినిమా కంటే బిచ్చగాడు2 గ్రేట్.. ఎందుకంటే?

Bichagadu 2: ఈ మధ్యకాలంలో సినిమాలు భాషతో సంబంధం లేకుండా అన్ని భాషలలో అద్భుతమైన ఆదరణ సంపాదించుకుంటున్నాయి. సినిమాలో కంటెంట్ ఉంటే భాషతో సంబంధం లేకుండా అన్ని భాషా చిత్రాలను ప్రేక్షకులు స్వాగతిస్తున్నారు. అయితే తాజాగా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్2 సినిమా విడుదలైన తర్వాత ఈ సినిమాకు తమిళంలో ఎంతో మంచి ఆదరణ వచ్చినప్పటికీ తెలుగులో మాత్రం ఈ సినిమా పెద్దగా ప్రేక్షకాదరణ సంపాదించుకోలేకపోయిందని చెప్పాలి.

 

ఇక ఈ సినిమా తమిళంలో సక్సెస్ సాధించి తెలుగులో సక్సెస్ కాకపోవడంతో కొన్ని తమిళ ఛానళ్లు అలాగే తమిళ యూట్యూబ్ ఛానల్ తెలుగు ప్రేక్షకుల పై తీవ్రస్థాయిలో మండిపడుతూ కథనాలు రచించారు. తెలుగు ప్రేక్షకులకు తమిళ సినిమాలు అంటే వివక్షని అందుకే తమిళ సినిమాలను స్వాగతించలేకపోతున్నారని కామెంట్ చేశారు.ఇక మరికొందరైతే తెలుగు ప్రేక్షకులకు కనీసం సినిమా అభిరుచి కూడా లేదు అంటూ కామెంట్లో చేశారు.

 

అయితే తాజాగా తమిళ చిత్ర పరిశ్రమ నుంచి మరో సీక్వెల్ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన బిచ్చగాడు 2సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ రాబట్టింది.ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో తెలుగు మీడియా తమిళ ప్రేక్షకులను ఓరెంజ్ లో ఆడుకుంటుంది. పొన్నియన్ సెల్వన్2 సినిమా విడుదలైన సమయంలో తెలుగు ప్రేక్షకులు తమిళ సినిమాలను ఆదరించలేదని కామెంట్లు చేశారు. మరి బిచ్చగాడు సినిమాని ఆదరించి ఇంత మంచి కలెక్షన్స్ రాబట్టాయని ప్రశ్నించారు.

 

మణిరత్నం సినిమాలాగే బిచ్చగాడు సినిమా కూడా సీక్వెల్ చిత్రమే ఇది కూడా తమిళ సినిమానే కానీ మణిరత్నం సినిమాకు రాని కలెక్షన్స్ బిచ్చగాడు 2 సినిమాకి వచ్చాయి అంటే అర్థం ఏంటి. బిచ్చగాడు 2 సినిమా తక్కువ బడ్జెట్ సినిమా అయినప్పటికీ కథలో కంటెంట్ ఉండటం వల్ల ఈ సినిమాని ఆదరించరని, కంటెంట్ లేకపోతే ఎలాంటి దిగ్గజ దర్శకుడు అయిన ఎలాంటి తారాగణం ఉన్న ప్రేక్షకులు అలాంటి సినిమాలను ఆదరించారని మరోసారి నిరూపితం అయింది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -