2000 notes: ఆ హీరోకు మోదీ నోట్ల రద్దుకు లింక్ ఉందని మీకు తెలుసా?

2000 notes: గత రెండు మూడు రోజులుగా దేశ వ్యాప్తంగా సంచలనం అయిన అంశాల్లో రూ. 2 వేల నోట్ల ఉపసంహరణ కూడా ఒకటి. ఎక్కడ చూసినా కూడా ఈ విషయం గురించి చర్చించుకుంటున్నారు. ఇటీవలే ఈ కరెన్సీ నోట్లను రద్దు చేయబోతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారికంగా ప్రకటించి ఒకసారిగా దేశ ప్రజలకు షాక్ ఇచ్చింది. కానీ ఆ నోట్లకు బ్యాంకులకు తిరిగి అప్పగించేందుకు సెప్టెంబర్ 30 వరకూ గడువును ఇచ్చింది. రేపు అనగా మే 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు గడువును ఇచ్చింది. అయితే ప్రస్తుతం ఈ వ్యవహారాన్ని బిచ్చగాడు సినిమాతో ముడి పెడుతున్నారు.

నోట్ల రద్దుకు బిచ్చగాడు సినిమాకు నోట్ల రద్దుకు సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. అయితే గతంలో వచ్చిన బిచ్చగాడు సినిమాలో దేశ ఆర్థిక పరిస్థితి మారాలంటే పెద్ద నోట్లను రద్దు చేయాలని చూపించారు. ఆ వెంటనే మోదీ ప్రభుత్వం రూ. 500 1000 నోట్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక ప్రస్తుతం బిచ్చగాడు 2 సినిమా వచ్చింది. అది విడుదలైన రోజే రూ. 2వేల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటన వెలువడింది. ఈ రెండు పర్యాయాల్లో విజయ్ ఆంటోనీ సినిమా రావడం యాదృశ్చికంగానే జరిగినా ఈ అంశాలకు సంబంధం ఉన్నట్లు సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటోన్నారు. అంతేకాదు హీరో విజయ్ ఆంటోనీ పాత్ర ఉందని మీమ్స్ చేస్తున్నారు.

 

అలాగే నోట్ల రద్దు గురించి నీకెలా తెలుసు బ్రో.. నువ్వు హీరోవా? జోతిష్కుడివా బ్రదర్ అంటూ తమదైన రీతిలో కామెంట్లను కూడా చేస్తున్నారు. ఇంకొందరు మాత్రం మోడీ నిర్ణయానికి విజయ్ ఆంటోనికి ఏమైనా సంబంధం ఉందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి నోట్ల రద్దు వ్యవహారం కాస్త బిచ్చగాడు2 సినిమానే కారణమంటూ వార్తలను తెగ వైరల్ చేస్తున్నారు. దీంతో అనుకోకుండా ఈ సినిమా నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -