Bhagavanth Kesari: రవితేజకి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన బాలకృష్ణ.. ఇంకోసారి బాలయ్యతో పోటీ అంటే వణికేలా?

Bhagavanth Kesari:  Bhagavanth Kesari: గతంలో చాలా సందర్భాలలో హీరో రవితేజ బాలకృష్ణ బాక్సాఫీస్ వద్ద పోటీ పడిన విషయం తెలిసిందే. కొన్ని సందర్భాలలో బాలకృష్ణపై రవితేజ పై చేయి సాధించారు. ఈసారి కూడా ఇదే రిపీట్ అవుతుంది అంటూ వార్తలు వినిపించినప్పటికీ ఆ వార్తలన్నింటినీ తిప్పి కొట్టారు బాలకృష్ణ. ఇటీవల దసరా సందర్భంగా విడుదలైన మూడు సినిమాల్లో భగవంత్ కేసరి హిట్ అయ్యింది. ఇక లియో-టైగర్ నాగేశ్వరావు లాంటి భారీ బడ్జెట్ సినిమాలపై భగవంత్ కేసరి పోటీ పడి గెలవడం ఒక ఎత్తైతే ముఖ్యంగా రవితేజ మీద బాలకృష్ణ గెలవడం మరో ఎత్తు అని చెప్పవచ్చు.

ఇప్పుడు భగవంత్ కేసరి సినిమాతో బాలకృష్ణ, రవితేజ టైగర్ నాగేశ్వరావు తో రవితేజ పోటీ పడడం అనేది మొదటిసారి కాదు. బాల‌కృష్ణ‌, ర‌వితేజ ఇప్ప‌టివ‌ర‌కు మూడు సార్లు బాక్సాఫీస్ వ‌ద్ద‌ పోటీపడ్డారు. వీరిద్దరూ పోటీపడిన ప్రతిసారి ర‌వితేజ‌నే విన్న‌ర్‌గా నిల‌వ‌డం గ‌మ‌నార్హం. 2008 సంక్రాంతికి బాల‌కృష్ణ ఒక్క‌మ‌గాడు, ర‌వితేజ కృష్ణ సినిమాలు రిలీజ‌య్యాయి. ఇందులో రవితేజ కృష్ణ సినిమా విజ‌యాన్ని ద‌క్కించుకోగా ఒక్క మ‌గాడు డిజాస్ట‌ర్ ఫ‌లితాన్ని మూట‌గ‌ట్టుకుంది.

ఆ త‌ర్వాత ఒక్క రోజే కాకపోయినా 2009లో ర‌వితేజ కిక్‌, బాల‌కృష్ణ మిత్రుడు సినిమాలు వారం గ్యాప్‌లో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చాయి. అందులో రవితేజ కిక్ ఇండ‌స్ట్రీ హిట్‌గా నిల‌వ‌గా మిత్రుడు వారంలోనే దుకాణం సర్దేసింది. మళ్ళీ రెండేళ్ల విరామం త‌ర్వాత 2011లో ర‌వితేజ మిర‌ప‌కాయ్‌, బాల‌కృష్ణ ప‌ర‌మ‌వీర‌చ‌క్ర సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద పోటీ పడ్డాయి. అప్పుడు కూడా సేమ్ రిజల్ట్ రిపీట్ అయ్యింది. బాల‌కృష్ణ‌, ర‌వితేజ ఇప్పుడు నాలుగో సారి ఫైట్‌కు దిగారు.

ఈ ఇద్ద‌రిలో విన్న‌ర్‌గా ఎవ‌రు నిలుస్తార‌న్న‌ది అందరూ ఆసక్తిగా ఎదురు చూసారు.ఫైనల్ గా నాలుగోసారి బాలకృష్ణ రవితేజ పై గెలిచి చూపించారు. టైగర్ నాగేశ్వరావు మంచి సినిమానే. రవితేజ కష్టపడ్డాడు. సినిమాకి అతి ముఖ్యమైన మైన పాయింట్ గా నిలిచిన టైగర్ నాగేశ్వరావు నిడివి కూడా కట్ చేసారు. అయినా సినిమాని ప్రేక్షకులు మెచ్చలేదు. ఫైనల్ గా భగవంత్ కేసరి టైగర్ నాగేశ్వరావుపై పై చెయ్యి సాధించింది..

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -