Bhagavanth Kesari: భగవంత్ కేసరి 5 రోజుల కలెక్షన్ల లెక్కలు ఇవే.. బాలయ్య సినిమా ఎంత సాధించిందంటే?

Bhagavanth Kesari: ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో దసరా కానుకగా రిలీజ్ అయిన భగవంత్ కేసరి అందరి అంచనాలకు తగ్గట్టుగానే కలెక్షన్ల పరంగా సునామీ సృష్టిస్తుంది. తండ్రి కూతుర్ల సెంటిమెంట్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఇక దసరా రోజు కూడా ఈ మూవీ ఓ రేంజ్ లో కలెక్షన్లు కురిపించింది.

ఈ నాలుగు రోజుల్లో భగవంత్ కేసరి ఎన్ని కోట్లు వసూలు చేసిందో ఒకసారి చూద్దాం. నైజాంతో మొదలుపెడితే నైజంలో 14.5 కోట్లు, సీడెడ్ లో 13 కోట్లు, ఉత్తరాంధ్రలో 8 కోట్లు, ఈస్ట్ గోదావరిలో ఎనిమిది కోట్లు, వెస్ట్ గోదావరి లో నాలుగు కోట్లు, గుంటూరులో 6 కోట్లు, కృష్ణ లో నాలుగు కోట్లు, నెల్లూరులో 2.60 కోట్లు, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 4.25 కోట్లు ఓవర్సీస్ లో ఆరు కోట్లు.

వరల్డ్ వైడ్ గా 67.35 కోట్లు బిజినెస్ చేసింది. అయితే 5వ రోజు నైజాంలో 1.45 కోట్లు, సీడెడ్ లో 1. 68 కోట్లు, ఉత్తరాంధ్రలో 41 లక్షలు, ఈస్ట్ గోదావరిలో 30 లక్షలు, వెస్ట్ గోదావరి లో 19 లక్షలు, గుంటూరులో 31 లక్షలు, కృష్ణాలో 35 లక్షలు, నెల్లూరులో 21 లక్షలు కలిపి మొత్తం 4.90 కోట్లు షేర్, 8.65 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. మొత్తం ఐదు రోజులకి కలిపి నైజంలో 10.95 కోట్లు.

సీడెడ్ లో 8.15 కోట్లు, ఉత్తరాంధ్రలో 2.99 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 1.71 కోట్లు, వెస్ట్ గోదావరిలో 2.01 కోట్లు, గుంటూరులో 4.19 కోట్లు, కృష్ణాలో 1.89 కోట్లు, నెల్లూరులో 1. 59 కోట్లు మొత్తం కలిపి 33.5 కోట్లు షేర్ 56.35 కోట్లు గ్రాస్ వచ్చింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఐదు రోజులకే కలిపి 42.40 కోట్లు షేర్, 93 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.మరొక 26.10 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్ చేరుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -