Bhagavanth Kesari Pre Review: భగవంత్ కేసరి మూవీ ప్రీ రివ్యూ.. బాక్సాఫీస్ షేక్ కావడంలో ఎలాంటి సందేహం లేదా?

Bhagavanth Kesari Pre Review: టాలీవుడ్ అగ్ర హీరో బాలకృష్ణ కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం భగవంత్ కేసరి. ఇందులో శ్రీ లీలా బాలకృష్ణ కూతురిగా నటించిన విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. వీర సింహారెడ్డి తో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న బాలకృష్ణ ఈ సినిమాతో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు టీజర్,పాటలకు వీక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతోంది నటీనటుల పనితీరు ఆ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కథ: ఈ మూవీ తండ్రీ, కూతుర్ల మధ్య ఎమోషనల్ గా సాగే కథ. ఇప్పటికే విషయంలో దర్శకుడు అనిల్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడు. బాలయ్యకు కూతురు పాత్రలో నటించిన శ్రీలీలకు మధ్య వచ్చే ప్రేమ ఆప్యాయత అనురాగంతో పాటు కూడిన సన్నివేశాలతో పాటు ఎమోషనల్ సన్నివేశాలు సినిమాకు హైలెట్ కానున్నాయి. తన కుమార్తెను ఒక తండ్రి ఆర్మీలో ఎందుకు ? జాయిన్ చేయాలని అనుకున్నాడు. దీని వెనుక ఉన్న మిషన్ ఏంటి? ఆర్మీలో జాయిన్ కావడం తనకు ఇష్టం లేకపోయినా తండ్రి ఎంత టార్చర్ పెట్టినా కూతురు ఏం చేసింది ? అన్నది ఈ సినిమాలో మెయిన్ పాయింట్.

విశ్లేష‌ణ: ఈ సినిమా ఖచ్చితంగా చాలా కొత్తగా ఉండడంతో పాటు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. ఈ విషయం ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లు, ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. మామూలుగా బాలయ్య యాక్షన్ హీరో.. బాలయ్య మాస్ జనాలకు బాగా నచ్చేస్తాడు. అలాగే అనిల్ రావిపూడి బాలయ్య స్టైల్ కు పూర్తిగా భిన్నమైన డైరెక్టర్. అనిల్ రావిపూడి అంటేనే కామెడీని నమ్ముకుని సినిమాలు తీసి సూపర్ హిట్లు కొడుతూ ఉంటాడు. అనిల్ గత సినిమాలు చూస్తుంటేనే అతడు స్టైల్ ఏమిటో తెలిసిపోతుంది. అలా రెండు భిన్న ధ్రువాలకు చెందిన వీరిద్దరూ కలిసి సరికొత్తగా తెరకెక్కించిన సినిమా భగవంత్ కేసరి. ఈ సినిమా మెయిన్ స్టోరీ అంత కథ మీదే నడుస్తుంది. ఈ సినిమాలో ఏకంగా ఏడెనిమిది ఫైట్లు ఉన్నాయి. ఐదు భారీ యాక్ష‌న్ స‌న్నివేశాలు. ఇవే సినిమాకు హైలెట్గా నిలవనున్నాయి. దీనికి తోడు బాల‌య్య చెప్పిన డైలాగులతో థియేటర్లు మోత మోగిపోనున్నాయి.

న‌టీన‌టుల పెర్పామెన్స్: న‌టీన‌టుల్లో బాల‌య్య గురించి కొత్త‌గా చెప్ప‌క్క‌ర్లేదు. అయితే ఈ సినిమాలో మాత్రం స‌రికొత్త బాల‌య్య‌ను చూడబోతున్నారట.. టీజ‌ర్లు, ట్రైల‌ర్లు కూడా బాల‌య్యను ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌ని క్యారెక్ట‌ర్లో చూడ‌బోతున్నాం అని సంకేతాలు ఇచ్చేశాయి. బాల‌య్య ఈ సినిమాలో ఫ‌స్ట్ టైం పూర్తిగా తెలంగాణ మాండ‌లికంలో డైలాగులు చెప్ప‌బోతున్నాడు. ఫైట్లు కూడా కొత్త‌గా ఉండ‌డంతో పాటు న‌డి వ‌య‌స్సులో ఉన్న వ్య‌క్తి అందులోనూ జైలు శిక్ష అనుభ‌వించి బ‌య‌ట‌కు వ‌చ్చాక అత‌డి మ‌న‌స్తత్వం ఎలా ఉండ‌బోతోంది ఇవ‌న్నీ విన‌డానికే కాదు చూడ‌డానికి కూడా కొత్త‌గా ఉండ‌బోతున్నాయ‌ని తెలుస్తోంది. శ్రీలీల ఇప్ప‌టి వ‌ర‌కు చేస్తోన్న రొమాంటిక్‌, గ్లామ‌ర్ సినిమాల‌కు భిన్నంగా బాల‌య్య కూతురు పాత్ర‌లో క‌నిపిస్తోంది. ఇటు అల్ల‌రి పిల్ల‌గాను, అటు మొండిఘ‌టంగాను తండ్రి మాట విన‌కుండా బెట్టు చేసే పాత్ర‌లో కనిపించనుంది. కాజ‌ల్ అగ‌ర్వాల్ మ‌ధ్య వ‌య‌స్సులో ఉంటూ బాల‌య్య‌తో ప్రేమ‌లో ప‌డే మెచ్యూర్డ్ పాత్ర‌లో క‌నిపించ‌నుంది.

టెక్నిక‌ల్: ఇక టెక్నిక‌ల్‌గా సీ రామ్‌ప్ర‌సాద్ బాల‌య్య‌కు క‌లిసొచ్చిన సినిమాటోగ్రాఫ‌ర్‌.. బాల‌య్య‌ను ఎలా ఏ యాంగిల్లో చూపించాలో రామ్‌ప్ర‌సాద్‌కు తెలిసిన‌ట్టుగా మ‌రెవ్వ‌రికి తెలియ‌దు. మామూలుగానే మ్యూజిక్‌తో పూన‌కాలు తెప్పిస్తోన్న థ‌మ‌న్ అఖండ‌, వీర‌సింహారెడ్డికి అద‌ర‌గొట్టేశాడు. ఇక వెంక‌ట్ యాక్ష‌న్ స‌రికొత్త‌గా ఉండ‌నుంద‌ని టీజ‌ర్‌, ట్రైల‌ర్ల‌లో ఫైట్లే చెప్పేశాయి. ఇక ర‌న్ టైం 160 నిమిషాలుగా ఉండ‌డంతో క్రిస్పీగానే సినిమా ఉండ‌నుంద‌ని క్లారిటీ ఉంది. బాల‌య్య గ‌త రెండు సినిమాల‌తో పోలిస్తే ఇది త‌క్కువ ర‌న్ టైం.

ఫైన‌ల్‌ గా అఖండ‌, వీర‌సింహారెడ్డి త‌ర్వాత బాల‌య్య అటు ఆరు వ‌రుస సూప‌ర్ హిట్లు ఇచ్చిన అనిల్ రావిపూడి క‌లిసి చేసిన భ‌గ‌వంత్ కేస‌రి సినిమాకు రు.110 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. ద‌స‌రాకు గ‌ట్టి కాంపిటేష‌న్‌లో వ‌స్తోన్న ఈ సినిమా హిట్ అయితే బాల‌య్య కెరీర్‌లో చాలా యేళ్ల త‌ర్వాత హ్యాట్రిక్ హిట్లు వ‌చ్చిన రికార్డ్ చేరుతుంది.

టైటిల్‌: భ‌గ‌వంత్ కేస‌రి
నటీనటులు: నంద‌మూరి బాల‌కృష్ణ‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, శ్రీలీల‌, అర్జున్ రామ్‌పాల్ త‌దిత‌రులు
సినిమాటోగ్ర‌ఫీ: సీ. రామ్‌ప్ర‌సాద్‌
మ్యూజిక్‌: థ‌మ‌న్ ఎస్‌.ఎస్‌
ఎడిటింగ్‌: త‌మ్మిరాజు
బ్యాన‌ర్‌: షైన్ స్క్రీన్స్‌
యాక్ష‌న్‌: వి. వెంక‌ట్‌
ఎగ్జిగ్యూటివ్ నిర్మాత‌: ఎస్‌. కృష్ణ‌
నిర్మాతలు: సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది
దర్శకుడు : అనిల్ రావిపూడి
రిలీజ్ డేట్‌: 19 అక్టోబ‌ర్‌, 2023

రేటింగ్‌: 3.3/5

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -