Bhagavanth Kesari: సంక్రాంతి బరిలో భగవంత్ కేసరి.. నమ్మకపోయినా నిజం మాత్రం ఇదేనంటూ?

Bhagavanth Kesari: అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ కలెక్షన్లతో దూసుకుపోతూ బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతుంది భగవంత్ కేసరి. భారీ బడ్జెట్ సినిమాలతో పోటీపడిన ఈ సినిమాని కుటుంబ ప్రేక్షకులు మెచ్చుకోవటంతో కలెక్షన్ల వర్షం కురుస్తుంది. అఖండ, వీర సింహారెడ్డి సినిమాలు హిట్ అందుకున్న తర్వాత భగవంత్ కేసరి సినిమా కూడా హిట్ అవటంతో హ్యాట్రిక్ కొట్టారుబాలయ్య.

నిజంగా ఈ వయసులో ఇంతటి ఘన విజయం సాధించడం అనేది మామూలు విషయం కాదు. అయితే ఇప్పుడు ఈ సినిమా 2024 పండగ బరిలో దిగబోతుంది ఈ సినిమా. ఇప్పటికే సినిమా రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతుంటే మళ్లీ రిలీజ్ అవ్వటమేంటి అనుకుంటున్నారా మీరు విన్నది నిజమే. ఈ సినిమా బుల్లితెరపై పండగలో ప్రసారం కావడానికి సిద్ధంగా ఉంది.

ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను జీ తెలుగు ఛానల్ దక్కించుకుంది. సినిమాని సంక్రాంతికి టెలికాస్ట్ చేయబోతుంది. ఎస్ ఎస్ తమన్ మ్యూజిక్ అందించిన భగవంత్ కేసరి సినిమా డిజిటల్ స్క్రీనింగ్ హక్కులను ప్రముఖ ఓటీటి అమెజాన్ ప్రైమ్ వీడియో చేజిక్కించుకుంది.ఈ విషయాన్ని టైటిల్ కార్డులో తెలిపేలా చేసింది మూవీ యూనిట్. అయితే సినిమాకు థియేటర్ రైట్స్ తో పాటు ఓటిటి హక్కులకు భారీగా డిమాండ్ ఏర్పడటంతో భారీ ధరకు అమెజాన్ ప్రైమ్ భగవంత్ కేసరి ఓటిటి రైట్స్ ని కొనుగోలు చేసింది.

ఈ సినిమాని నవంబర్ ఆఖరి వారంలో కానీ డిసెంబర్ మొదటి వారంలో కానీ స్ట్రీమింగ్ చేయనున్నట్లుసమాచారం. అయితే డేట్ ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. థియేటర్లో సక్సెస్ఫుల్గా నడిచిన ఈ సినిమా సంక్రాంతికి టీవీల్లో సందడి చేయబోతుంది. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ జీ తెలుగు ఛానల్ దక్కించుకుంది సంక్రాంతికి ఈ సినిమాను టెలికాస్ట్ చేయనుంది. సిల్వర్ స్క్రీన్ మీద దుమ్మురేపిన బాలయ్య బాబు సినిమా ఓటీడీలో ఏ రేంజ్ లో దుమ్ము రేపుతుందో చూడాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -