Bhola Shankar: అలా తీసి ఉంటే భోళా శంకర్ ఇండస్ట్రీ హిట్.. చిరంజీవి గారు మీకు అర్థమవుతోందా?

Bhola Shankar: ప్రస్తుత కాలంలో టాలీవుడ్ హీరోలందరూ కూడా రీమేక్ సినిమాల పైన దృష్టి పెడుతున్నారు. ఇలా రీమేక్ సినిమాలు అంటేనే ప్రేక్షకులలో కొంతమేర ఉత్సాహం తగ్గిపోతుంది. ఇలా హీరోలు అందరూ కూడా రీమేక్ సినిమాల వెంట పడటంతో ప్రేక్షకులు రీమేక్ వద్దు బాబోయ్ అంటూ దండం పెట్టేస్తున్నారు.ఇక చిరంజీవి వేదాళం సినిమాకు రీమేక్ చిత్రాన్ని ప్రకటించిన సమయంలో చాలామంది అభిమానులు ఈ సినిమాని తిరస్కరించారు.

ఇక ఈ సినిమాకు ఫ్లాప్ డైరెక్టర్ మెహర్ రమేష్ డైరెక్టర్గా వ్యవహరించబోతున్నారన్న విషయం తెలియడంతో మెగా అభిమానులు భారీ స్థాయిలో గగ్గోలు పెట్టినప్పటికీ చిరంజీవి మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గకుండా మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు అయితే ఈ సినిమా అనుకున్న విధంగానే డిజాస్టర్ అయింది.

 

ఇక ఈ సినిమా చూసిన తర్వాత ఎంతోమంది అభిమానులు వేదాళం సినిమాని ఉన్నది ఉన్నట్టు కనక తీసి ఉంటే ఈ సినిమా సూపర్ హిట్ అయ్యేదని కానీ తమిళ సినిమాకు ఈ సినిమాకు చాలా తేడాలు ఉన్నాయని తెలియజేశారు. త‌మిళంలో హైలైట్ అనుకున్న సీన్లు తెలుగులోకి వ‌చ్చేస‌రికి తేలిపోయాయి. అమాయ‌కంగా క‌నిపించే అజిత్.. త‌న రెండో కోనాన్ని చూపించే సీన్ వేదాళంకు హైలైట్. ఇలాంటి హైలెట్ సీన్స్ అన్నిటినీ మెహర్ రమేష్ తెలుగులో పూర్తిగా తీసేశారు.

 

ఇక అజిత్ పాత్ర త‌మిళంలో అమాయ‌కంగా.. చాలా వ‌ర‌కు సీరియ‌స్‌గా క‌నిపిస్తే తెలుగులో చిరంజీవి క్యారెక్ట‌ర్‌ను మాత్రం కామెడీగా డీల్ చేశారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో అయితే ఖుషి న‌డుము సీన్ లాంటివి పెట్టి ఆ పాత్ర ఔచిత్యాన్ని పూర్తిగా దెబ్బ తీశారు. ఇలా తెలుగు వెర్షన్ లోకి వచ్చే సమయానికి ఈ సినిమా పూర్తిగా మారిపోవడంతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఫాన్స్ వేదాళం సినిమాని ఉన్నది ఉన్నట్టు తీసి ఉన్న ఈ సినిమా హిట్ అయ్యేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -