Neha Chowdary: బిగ్‌బాస్‌ హౌస్‌లోని బాత్రూమ్‌ కెమెరాలు ఆ శబ్దాలను పసిగడుతాయట.. నేహా చౌదరి షాకింగ్‌ కామెంట్‌

Neha Chowdary: బిగ్‌బాస్‌ హౌస్‌ అంటే అందరికీ తెలుసు అందులో ఉండే వారికి బయటి ప్రపంచం గురించి ఏమీ తెలియదని. అక్కడ టీవీ ఉండదు, ఫోన్‌ ఉండదు, కనీసం రోజువారీ న్యూస్‌ పేపర్‌ కూడా దొరకదు. వారు ఆ హౌస్‌ నుంచి బయటకు వచ్చే వరకు వారికి బయటి ప్రపంచం గురించి అస్సలు తెలియదు. హింది అయిన తెలుగు బిగ్‌బాస్‌లో ఈ నిబంధనలు ఉంటాయని అందరికీ తెలిసిన విషయమే.

తాజాగా జరుగుతున్న బిగ్‌బాస్‌లో కొన్ని వెలుసుబాటు కల్పించారని అందులో భాగంగా సెల్‌ఫోన్‌కు అనుమతి ఇచ్చారనే పుకార్లు బాగా వినిపిస్తున్నాయి. ఈ పుకార్లపై నేహా చౌదరి స్పందించింది. మూడో వారం ఎలిమినేషన్‌లో భాగంగా నేహా చౌదరి బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి బయటికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న అడగ్గా, నేహా చౌదరి కొన్ని పాకింగ్‌ అంశాలు వెల్లడించింది.

మొబైల్‌కు మాత్రం అక్కడ అనుమతి లేదని స్పష్టం చేసిన నేహా చౌదరి, ఓ కంటెస్టెంట్‌ చుట్టూ దాదాపుగా 4–5 కెమెరాలు నిఘా ఉంచుతాయని వెల్లడించింది. నడక మొదులుకొని ఇతరాత్ర విషయాలైనా ఆ కెమెరాలకు చిక్కాల్సిందే అని నేహా చౌదరి చెప్పుకొచ్చింది. అంతేకాదు, బాత్రూమ్‌ లో కూడా రెండు కెమెరాలుంటాయట. అయితే, అవి కేవలం వాయిస్‌ మాత్రమే నోటీస్‌ చేస్తాయట. బాత్రూంలో ఏమైనా సౌండ్స్‌ చేస్తే బయటికి తెలిసిపోతుందనీ నేహా చౌదరి రివీల్‌ చేసింది.

అలాగే బెడ్‌ వెనక కూడా కెమెరాలతో పాటు రెండు మైకులు వుంటాయట. ఒకవేళ పడుకున్నప్పుడు ఎవరైనా మైక్‌ తీసేసి సీక్రెట్‌ గా గుసగుసలాడుకుంటే, ఆ మాటల్ని సైతం ఆ మైకులు పట్టిస్తాయని నేహా చౌదరి చెప్పింది. ఇదిలావుంటే, నేహా చౌదరి స్ట్రాంగెస్ట్‌ కంటెస్ట్‌ పదేళ్ల యాంకరింగ్‌ అనుభవం వున్న సేహా చౌదరి, డాస్సీ, గ్లామర్‌ లుక్స్, ఇతరత్రా టాలెంట్స్‌ నూ నేర్పరి. అలాంటిది ఇంత త్వరగా ఆమె హౌస్‌ నుంచి బయటికి రావడాన్ని ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -