Bigg Boss Season 6: పెయిడ్ ఆర్టిస్టులతో చప్పట్లు కొట్టించుకుంటూ.. దొరికేసిన నాగార్జున?

Bigg Boss Season 6: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ బాస్ షో గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ లో మొదలైన ఈ షో ఎన్నో అనుమానాలతో టాలీవుడ్ లో కూడా స్టార్ట్ చేశారు. కాగా ఈ షోకు తెలుగులో భారీ స్థాయిలో ఆదరణ దక్కింది. కాగా గణనయంగా 5 సీజన్లు పూర్తి చేసుకుంది. ఇక ఈ షో హోస్ట్ నాగార్జున కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాడు.

కాగా ఇటీవల సీజన్ సిక్స్ బరిలోకి దిగింది. అయితే ఈసారి బిగ్ బాస్ సీజన్ సిక్స్ ప్రేక్షకులను అంతగా కట్టుకోలేక పోతుంది. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ సిక్స్ గతంలో ఉన్నట్టుగా కట్టు దిట్టంగా ఉండడం లేదు. ఏదో తూతూ మంత్రంలా ఈ షో ను నడుపుతున్నారు. ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్ లో విషయంలో కూడా కంటెస్టెంట్లతోపాటు ఒక కామన్ మెన్ కూడా హౌస్ లో అడుగు పెడతాడని మొదట ప్రచారం జరిగింది. కానీ ఒక యూట్యూబర్ ను తీసుకుని వచ్చి కామన్ మెన్ కోటాలో భర్తీ చేశారు.

కాగా కంటెస్టెంట్ల విషయం అసలు జెన్యూన్ సెలక్షన్ ఏమాత్రం ఉండడం లేదని తెలుస్తుంది. మొత్తం రికమండేడ్ కంటెస్టెంట్ లో అని చాలామంది అనుకుంటున్నారు. ఇదంతా పక్కన పెడితె నాగార్జున మరోసారి ప్రేక్షకులకు దొరికిపోయాడు. బిగ్ బాస్ సీజన్ 6 లో శని ఆదివారాల్లో నాగార్జున ఎంట్రీ ఇచ్చేటప్పుడు కొంతమంది అడియన్స్ ముందు కూర్చుని చప్పట్లు కొడుతున్నారు. ఇక నాగార్జున ఆడియన్స్ ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. అంతే కాకుండా ఆడియన్స్ నిర్ణయమే ఫైనల్ అని అంటున్నారు.

అసలు నాగార్జున ముందు కూర్చునే ఆడియన్స్ లో ఎవరు జన్యున్ ఆడియన్స్ కాదట. వాళ్లు కూడా బిగ్ బాస్ నిర్వహణ లో ఒక భాగమట. వాళ్లు పెయిడ్ ఆర్టిస్టులు అని తెలుస్తుంది. కాగా కాకపోతే వాళ్ళని ఆడియన్స్ గా బిగ్ బాస్ మరిపిస్తున్నట్లు కొందరు అనుకుంటున్నారు. బిగ్ బాస్ లో ఆడియన్స్ లో ఒక అమ్మాయి శ్రీముఖి హోస్ట్ గా చేస్తున్న స్టార్ మా పరివార్ షోలో ఆడియన్స్ లో కనిపించింది. దాంతో బిగ్ బాస్ ప్రియులు ఈ విషయాన్ని గమనించారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -