Bigg Boss: శ్రీసత్య ఫ్యామిలీ అలాంటి కష్టాలు అనుభవించిందా?

Bigg Boss: తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 6 ఆసక్తికరంగా సాగుతోంది. కంటెస్టెంట్లను బిగ్‌ బాస్‌ విపరీతంగా వాడేసుకుంటున్నాడు. ఈ క్రమంలో ప్రైజ్‌ మనీపై కన్నేసిన బిగ్‌ బాస్‌.. 50 లక్షల రూపాయల సొమ్ములో కోత విధించడం మొదలు పెట్టాడు. విజేతకు 50 లక్షలు అందిస్తామని ఆదివారం నాగార్జున ప్రకటించాడు. అయితే, కంటెస్టెంట్లు షోను రక్తి కట్టించడం లేదని బిగ్‌ బాస్‌ భావిస్తున్నాడో ఏమో.. ఆ ప్రైజ్‌ మనీ కాస్తా రూ. 44,00,300కు కుదించారు. ఇది ఇంకా డౌన్‌ ఫాల్‌ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇలాంటి ట్విస్టులకు కంటెస్టెంట్లు అవాక్కవుతున్నారు.

 

మరోవైపు డబ్బు ఎందుకు అవసరం అంటూ ఇంటి సభ్యులను అడగడంతో ఒక్కొక్కరు ఒక్కోలా స్పందించారు. మొదట ఫైమా మాట్లాడుతూ.. తాము నలుగురు ఆడ పిల్లలు సంతానం అని తెలిపింది. బాల్యం నుంచి అనేక కష్టాలు ఎదుర్కొన్నట్లు వివరించింది. రోజూ పొలం పనికి వెళ్లి వచ్చే డబ్బుతో నిత్యావసరాలు కొనుక్కొనే వాళ్లమని తెలిపింది. ఊళ్లో బాడుగ ఇళ్లలో ఉండేవారమని, అనేక ఇళ్లు మారినట్లు తెలిపింది. ఓసారి తమకంటే ఎక్కువ రెంట్‌ ఇస్తామన్న కారణంతో తమను ఇళ్లు ఖాళీ చేయించారని వాపోయింది. తన తల్లికి మంచి ఇల్లు కట్టివ్వాలన్నదే తన కోరిక అని తెలిపింది.

 

ఇక ఆదిరెడ్డి స్పందిస్తూ, తన తండ్రి సరిగా పనిచేయకపోవడంతో అమ్మ చాలా కష్టాలు పడిందని తెలిపాడు. నిండి గర్భిణిగా ఉన్నప్పుడు కూడా గడ్డిమోపులు మోసిందని గుర్తు చేసుకున్నాడు. తనకు ప్రస్తుతం పెద్దగా సమస్యల్లేవని తన భార్యకు సొంతిల్లు కట్టివ్వాలన్నదే తన కోరిక అని తెలిపాడు.

 

అమ్మకు నాణ్యమైన వైద్యం అందిస్తా..

మరోవైపు శ్రీసత్య వంతు రాగా, ఆమె భావోద్వేగానికి గురైంది. చిన్న నాటి నుంచి తన తండ్రి ఏలోటూ లేకుండా పెంచాడని తెలిపింది. ఓసారి తన కుటుంబంలో అనారోగ్య సమస్యలు వచ్చాయని తెలిపింది. ఆ సమయంలో కుటుంబమంతా మూడు రోజులపాటు పస్తులుండాల్సి వచ్చిందని చెప్పింది. తన తల్లికి వైద్యం చేయించడానికి ఉన్న ఇంటిని అమ్మేసుకోవాల్సి వచ్చిందని చెప్పింది. తాను సంపాదించిందంతా అమ్మ వైద్యానికి సరిపోతోందని వాపోయింది. బిగ్‌ బాస్‌ విన్నర్‌ అయితే వచ్చే సొమ్ముతో అమ్మకు నాణ్యమైన వైద్యం అందించి ఇంకా ఓ మంచి ఇల్లు కట్టుకోవాలని ఉందని వివరించింది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -