Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ షో సీజన్7 ఎలిమినేషన్ లో చెత్త ట్విస్ట్.. ఈ వారం కూడా అమ్మాయే ఎలిమినేట్!

Bigg Boss 7 Telugu: తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఊహించని ట్విస్టులు, కొట్లాటలు గొడవలు షాకింగ్ ఎలిమినేషన్ లతో రసవత్తరంగా సాగుతోంది. అయితే బిగ్ బాస్ సీజన్7 చూస్తున్న ప్రేక్షకులకు ఆ షోలో ఏం జరుగుతుంది అనేది అసలు అర్థం కావడం లేదు. ఇప్పటివరకు బిగ్బాస్ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మొదటి నాలుగు వారాలు నలుగురు లేడీ కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లిపోవడం అన్నది నిజంగా మొదటిసారి అని చెప్పవచ్చు. ఈ విషయంపై ప్రేక్షకులు బిగ్ బాస్ షో నిర్వాహకులపై మండిపడుతున్నారు.

అయితే ఇప్పుడు ఊహించని విధంగా ఐదవ వారం టాప్ కంటెస్టెంట్ అనుకున్న ఆమె ఎలిమినేట్ కాబోతోంది అన్న వార్త హాట్ టాపిక్ గా మారింది. గత మూడు నాలుగు వారాల్లో పవరస్త్ర గెలుచుకున్న సందీప్, శోభాశెట్టి, ప్రశాంత్ తప్ప మిగిలిన ఏడుగురు ఈ వారం నామినేట్ అయ్యారు. ఈ జాబితాలో ఓట్ల శాతం వారం మొత్తం పైకి కిందకు జరిగింది. శుక్రవారానికి వచ్చేసరికి శివాజీ టాప్‌లోనే ఉన్నాడు. తర్వాత స్థానాల్లో గౌతమ్, యావర్, శుభశ్రీ, తేజ ఉన్నట్లు తెలుస్తోంది. చివరి రెండు స్థానాల్లో అమర్ దీప్, ప్రియాంక ఉన్నట్లు సమాచారం. అయితే ఈ వారం నామినేషన్స్ తర్వాత తేజని దిగువన ఉన్నారు. కానీ కెప్టెన్సీ టాస్క్ జరుగుతున్న క్రమంలోనే తేజకు ఓటింగ్ శాతం పెరిగింది.

దీంతో అమర్ దీప్, ప్రియాంకని వెనక్కి నెట్టి ఐదో స్థానానికి వచ్చేశాడు. దీంతో చివరి స్థానంలోని ప్రియాంకనే ఈసారి ఎలిమినేట్ కాబోతుందని అంటున్నారు. అయితే ఈసారి కూడా బిగ్ బాస్ హౌస్ నుంచి లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయితే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయని ఇప్పటికే ప్రేక్షకులు బిగ్ బాస్ షో నిర్వాహకులను హెచ్చరించిన విషయం తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -