Sivaji Elimination: బిగ్ బాస్ హౌస్ నుంచి శివాజీ ఎలిమినేట్.. బుద్ధి లేని పనులు చేయడంలో బిగ్ బాస్ గ్రేట్ అంటూ?

Sivaji Elimination: తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ సెవెన్ చూస్తుండగానే అప్పుడే ఆరువారాలను విజయవంతంగా పూర్తి చేసుకుని ఏడవ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. వరుసగా ఆరుగురు లేడి కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. బిగ్బాస్ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఇలా వరుసగా లేడీ కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసారు. ఇకపోతే బిగ్ బాస్ సెవెన్ లో వివాదాస్పద కంటెస్టెంట్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు శివాజీ. అలాంటి శివాజీ హౌస్‌ నుంచి బయటకు వచ్చేశారు అనడం కంటే పంపేశారు అని చెప్పడం కరెక్ట్‌.

తాజాగా ఆదివారం జరిగిన ఎపిసోడ్ ముగిసిన తర్వాత చూపించిన ప్రోమోలో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తుంది. నయని పావని ఎలిమినేషన్‌ అయిన తర్వాత సడెన్‌గా శివాజీ కన్ఫెషన్ రూమ్‌లో కనిపించాడు. శివాజీ మిమ్మల్ని బయటికి తీసుకువెళ్లడం జరుగుతుందని ఆ సమయంలో బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో శివాజీ కూడా బయటికి వచ్చి అక్కడే ఉన్న హౌస్‌మెట్స్‌తో నేను బయటికి వెళ్తున్నాను అని చెప్తాడు. దీంతో కంటెస్టెంట్లు అందరూ శివాజీని వెళ్లొద్దని ఆపే ప్రయత్నం చేశారు. కానీ అదే సమయంలో డోర్స్ ఓపెన్ అయ్యాయి. ఆ వెంటనే శివాజీ బయటికి వెళ్లిపోయాడు. గేట్స్ క్లోజ్ అయిపోయాయి. దీంతో ఆట నుంచి ఆయన బయటకు వచ్చేసినట్లే..

అయితే శివాజీ హెల్త్ కండిషన్ బాగాలేక పోవడంతో శివాజీని బయటకు పంపించిన్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఐదో వారం కెప్టెన్సీ టాస్క్ లో బాగంగా వైర్స్ కింద నుంచి పాకుతూ వెళ్లే గేమ్‌లో శివాజీ గాయపడ్డాడు . దీని తర్వాత ఆయన పెద్దగా టాస్క్‌లలో పాల్గొనలేదు. భుజం చెయ్యి నొప్పి భరిస్తూనే హౌస్‌లో కొనసాగాడు. బిగ్‌బాస్‌లో ఎవరికైనా ఇలాంటి చిన్న ఇబ్బందికి గురైతే షో యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు.

గాయంతో ఇబ్బంది పడుతున్న శివాజీకి వైద్యులు సలహా మేరకే ఆయన హౌస్‌ నుంచి బయటకు వచ్చి ఉంటారని తెలుస్తోంది. అలాగే శివాజీ మళ్ళీ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. బుద్ధి లేని పనులు చేయడంలో బిగ్ బాస్ గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -