Sivaji-Prashanth: పల్లవి ప్రశాంత్ కి వెన్నుపోటు పొడిచిన శివాజీ.. బిగ్ బాస్ షోలో ఈ ట్విస్ట్ మామూలుగా లేదుగా!

Sivaji-Prashanth:  ఈ సీజన్ బిగ్ బాస్ చాలా డిఫరెంట్ గా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అని మాటీవీ యాజమాన్యం చెప్పినప్పుడు అదంతా పబ్లిసిటీ అనుకున్నారు జనాలు. కానీ నిజంగానే కొత్త కాన్సెప్ట్ తో బిగ్ బాస్ 7 సీజన్ అదరగొడుతుంది. బిగ్ బాస్ తరీఖా లో కూడా చాలా మార్పు కనిపిస్తుంది. అలాగే ఆట కూడా ఉల్టా పల్టా ఉన్నట్టు డిజైన్ చేశారు నిర్వాహకులు. ఈ సీజన్ లో పవర్ అస్త్ర కాన్సెప్ట్ ని కూడా తీసుకువచ్చారు.

ఏమాత్రం ఆట బాగోకపోయినా వారి దగ్గర నుంచి ఆ అస్త్రాలు తీసుకుంటున్నారు. శివాజీ దగ్గర పవరాస్త్రం, పల్లవి ప్రశాంతి దగ్గర నుంచి కెప్టెన్ బ్యాడ్జిని కూడా అలాగే లాగేసుకున్నారు. నిజానికి కెప్టెన్ గా చేయడం అంతా ఈజీ టాస్క్ కాదు, హౌస్ లో ఉన్న వాళ్ళందరినీ క్రమశిక్షణలో పెట్టాలి, అలా చేయలేకపోతే అతని కెప్టెన్సీ పోతుంది. అలాగే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కెప్టెన్సీ కూడా పోయింది. అయితే కెప్టెన్ అయిన వ్యక్తి మాటకి హౌస్ లో ఉన్న వాళ్ళందరూ విలువ ఇవ్వాలి, కానీ హౌస్ లో అది జరగలేదు.

కెప్టెన్ మాటకి ఎవరు విలువ ఇవ్వకపోగా ప్రశాంత్ ది బాడ్ కెప్టెన్సీ అంటూ చేతులు ఎత్తి ఓటు వేశారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఎప్పుడు రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ గెలవాలి అనే శివాజీ కూడా చెయ్యి లేపటంతో హౌస్ లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. బలహీనుల వెంట తాను ఉంటాను అన్న శివాజీ ప్రశాంత్ కెప్టెన్సీని లాగేసుకుంటుంటే తను కూడా చేయి కలిపాడు. ఇదంతా చూస్తున్న ప్రేక్షకులు శివాజీ ప్రశాంత్ కి వెన్నుపోటు పొడిచాడు అంటున్నారు.

మొదటినుంచి ఇప్పటివరకు ప్రశాంత్ ని వెనకేసుకొచ్చిన శివాజీ తీరా అతను కష్టంలో ఉన్నప్పుడు వాడికి కెప్టెన్సీ చేయడం చేత కావట్లేదు అంటూ ప్రశాంత్ కి ఆపోజిట్ గా ఓటేశాడు. అయితే ఇక్కడ శివాజీకి కూడా తెలియని విషయం, ప్రేక్షకులు గమనించిన విషయం ఏమిటంటే నిజానికి పల్లవి ప్రశాంత్ మాటకి ఎవరు విలువ ఇవ్వలేదు. ప్రశాంత్ చెప్పిన పని చేయకుండా పక్కకి వెళ్లి జోకులు కూడా వేసుకోవటం గమనించిన ప్రేక్షకులు ప్రశాంత్ ది తప్పేమీ లేదు అంటున్నారు. మరి ఈ విషయం బిగ్ బాస్ గుర్తించిందో లేదో తెలియాలి.

Related Articles

ట్రేండింగ్

Pithapuram: పిఠాపురంలో ఫుల్ సైలెంట్ అయిన ఓటర్లు.. మద్దతు ఏ పార్టీకి అంటే?

Pithapuram:  ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రత్యర్థుల మీద మాటల దాడి చేస్తూ తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు రాజకీయ నాయకులు. ఆ పార్టీ ఈ పార్టీ అనే కాకుండా ప్రతి పార్టీ వారు తమ...
- Advertisement -
- Advertisement -