Bigg Boss 6 Telugu: ఈ సారి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే వాళ్ళు వీరేనా!

Bigg Boss 6 Telugu:  తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. టెలివిజన్ లో పలు షో లను కొట్టి పడేసే విధంగా బిగ్ బాస్ షో ఒక రేంజ్ లో ప్రజాదరణ దక్కించుకుంది. ఇక గత కొంతకాలం వరకు టెలివిజన్ లో ప్రసారమైన ఈ షో సీజన్ 5 నుంచి ఓటీటీ రూపంలో ప్రసారమవుతుంది.

ఇక మరో రెండు రోజుల్లో బిగ్ బాస్ సీజన్ సిక్స్ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కనుక ఈ విషయం తెలిసిన ప్రేక్షకులు బిగ్ బాస్ సీజన్ సిక్స్ కోసం కండ్లు కాచేలా ఎదురుచూస్తున్నారని చెప్పవచ్చు. బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున కూడా రోజుకు ఒక అప్ డేట్ తో బిగ్ బాస్ ప్రియులు మరింత ఆసక్తికరంగా ఎదురు చూసేలా చేస్తున్నాడు.

ఇక ఇదే క్రమంలో సీజన్ సిక్స్ లో పాల్గొనే కంటెస్టెంట్ ల పేర్లు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే హౌస్ లో కంటెస్టెంట్లతో పాటు ఇద్దరూ కామన్ వ్యక్తులు కూడా హౌస్ లోకి వస్తున్నారన్నట్లు సమాచారం అందుతుంది. అసలు కంటెస్టెంట్లు విషయానికొస్తే.. సింగర్ రేవంత్, యాక్టర్ అభినయశ్రీ, సీరియల్ యాక్టర్స్ మెరిన్, రోహిత్ హీరోయిన్ వాసంతి పేర్లు వినిపిస్తున్నాయి.

అంతేకాకుండా శ్రీ సత్య, శ్రీహాన్, గీతు రాయల్, యాంకర్ నేహా చౌదరి, యూట్యూబర్ ఆదిరెడ్డి, టీవీ9 యాంకర్ ఆరోహి, ఇనయ సుల్తానా, బాల ఆదిత్య, చలాకి చంటి , ఆర్ జె సూర్యల పేర్లు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇక వీరితో పాటు ఇద్దరు కామన్ వ్యక్తులు కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి తెగ హడావిడి చేస్తారు అన్న వార్తలు గట్టిగా వినపడుతున్నాయి.

మరి ఆ హౌస్ లో కంటెస్టెంట్లుగా ఎవరు హడావిడి చేయబోతున్నారు అన్న దానిపై పూర్తిగా క్లారిటీ లేదు. కంటెస్టెంట్ ల గురించి ప్రొపెర్ గా తెలియాలి అంటే.. బిగ్ బాస్ నిర్వాకులు మరో అప్ డేట్ ఇచ్చే వరకూ వేచి చూడాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -