Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్7 రెమ్యునరేషన్లు ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే.. ఎవరికి తక్కువంటే?

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 6 అట్టర్ ప్లాప్ అవటంతో బిగ్ బాస్ 7ని చాలా డిఫరెంట్ గా డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ షో ఎలాగైనా హిట్ చేయాలని చూస్తున్నారు అటు నిర్మాతలు ఇటు హోస్ట్ నాగార్జున. అందుకే గేమ్ ని పూర్తిగా డిఫరెంట్ గా డిజైన్ చేశారు. ఈ సీజన్లోకి వచ్చిన కంటెస్టెంట్లు లో చాలామంది సీరియల్ నటులే కావటం విశేషం. అయితే రెమ్యూనరేషన్ విషయానికి వస్తే అందరికన్నా ఎక్కువగా సినీ హీరో శివాజీకి ఇవ్వగా అందరికన్నా తక్కువ పల్లవి ప్రశాంత్ కి అందుతుందని సమాచారం.

ఇప్పుడు ఒక్కొక్కరిగా ఒక్కొక్క కంటెస్టెంట్ కి వారానికి ఎంత ఇస్తున్నారో చూద్దాం. ముందుగా షో ని రక్తి కట్టించడానికి శాయశక్తుల కృషి చేస్తున్న హోస్ట్ కింగ్ నాగార్జున కి సీజన్ మొత్తానికి కలిపి 10 కోట్ల వరకు పారితోషకం అందుతుందని సమాచారం. అలాగే సినీ హీరో శివాజీకి వారానికి నాలుగు లక్షల రూపాయల రెమ్యూనరేషన్, మరో కంటెస్టెంట్ షకీల కి వారానికి 3.5 లక్షల రూపాయలు రెమ్యూనరేషన్ అందుతుందని సమాచారం.

ఇక కిరణ్ రాథోడ్ కి 3 లక్షలు, ఆట సందీప్ కి 2.75 లక్షలు, ప్రియాంక కి రెండు 2.5 లక్షలు, దామిని, రతికా రోజ్ ఇద్దరికీ చెరో రెండు లక్షలు. శోభ శెట్టికి 2.25 లక్షలు అలాగే అమర్ దీప్ కి రెండు పాయింట్ ఐదు లక్షలు. ప్రిన్స్ యావర్ కి 1.5 లక్షలు రెమినరేషన్ ఇవ్వగా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ కి మాత్రం కనిష్టంగా వారానికి కేవలం లక్ష రూపాయలు పారితోషకం అందుతుందని సమాచారం.

గెలిచిన వాళ్లకి ఎలాగూ 50 లక్షల ప్రైజ్ మనీ గురించి అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ సిక్స్ కి జరిగిన పరాభవం దృష్టిలో పెట్టుకొని గేమ్ ని డిఫరెంట్ గా డిజైన్ చేసినట్లు, సీజన్ మొత్తం డిఫరెంట్ గా ఉండబోతున్నట్లు సమాచారం. చూడాలి మరి జనాలని బిగ్ బాస్ సెవెన్ ఎంతగా రక్తి కట్టిస్తుందో.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -