Lavanya Tripathi: విడాకులు తీసుకున్న మొహాలు నా కూతురు పెళ్లిలో కనిపించకూడదు.. లావణ్య తల్లి షాకింగ్ కామెంట్స్ !

Lavanya Tripathi:  మరికొద్ది రోజుల్లో మెగా ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటికే మెగా ఫ్యామిలీ అందుకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. వరుణ్ తేజ్ లావణ్య పెళ్లి ఇటలీలో జరగనున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ మేరకు ఈ విషయంపై ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఆ సంగతి పక్కన పెడితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త హాట్ టాపిక్ గా మారింది. ఆ వార్త వైరల్ అవ్వడంతో కొంతమంది అభిమానులు నిజమేనా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆ మధ్య కాలంలో నిహారిక విడాకుల ముందు నిహారిక జీవితం బాగు చేశాకే మనం పెళ్లి చేసుకుందాం అని లావణ్య త్రిపాఠి చెప్పినట్టు వార్తలు వినిపించాయి.

అలాగే లావణ్య త్రిపాటికి పెళ్ళికి ముందే మెగా ఫ్యామిలీ సినిమాల్లో నటించకూడదని కండిషన్ పెట్టినట్టు ఇలా ఎన్నో రకాల రూమర్స్ తెరమీద వినిపించాయి. అలా తాజాగా కూడా మరో రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతతోంది. అదేంటంటే పెళ్లికి మరికొన్ని రోజులు ఉన్న సమయంలో మెగా ఫ్యామిలీకి లావణ్య త్రిపాటి తల్లి ఒక షాకింగ్ కండిషన్ పెట్టిందట. ఆ కండిషన్ విన్న ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. ఇంతకీ లావణ్య త్రిపాఠి తల్లి పెట్టిన కండిషన్ ఏంటంటే.. ఈ మధ్యకాలంలో మెగా డాటర్స్ అయినా శ్రీజ నిహారిక ఇద్దరు విడాకులు తీసుకొని భర్తలకు దూరంగా ఉంటున్నారు. అలాంటి అమ్మాయిలు నా కూతురు పెళ్లికి వస్తే నలుగురు నానా రకాలుగా మాట్లాడుకుంటారు.

ఆ విడాకులు తీసుకున్న ఇద్దరు నా కూతురు పెళ్లికి రాకూడదు అంటూ కండిషన్ పెట్టిందట. కానీ ఈ కండిషన్ కి మెగా ఫ్యామిలీ అస్సలు ఒప్పుకోలేదట. పెళ్లి విడాకులు అనేది వారి సొంత నిర్ణయాలు. అలాంటిది ఇంట్లో జరిగే పెళ్లికి మా కూతుర్లే రాకుంటే ఎలా అంటూ నాగబాబు లావణ్య తల్లి తో గట్టిగా వారించారట. మా కుటుంబం గురించి అన్ని తెలిసే మీరు ఈ పెళ్లికి ఒప్పుకున్నారు. మళ్ళీ ఇలాంటి కండిషన్లు ఏంటి అంటూ లావణ్య తల్లి పై సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఇక ఈ విషయంలో లావణ్య త్రిపాఠి కలగజేసుకొని తల్లికి సర్ది చెప్పిందట. అంతేకాదు అలాంటి నిర్ణయాలు ఏమైనా ఉంటే మానుకోమని గడ్డి పెట్టినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ఈ రూమర్ మాత్రం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. కొందరు లావణ్య తల్లికి సపోర్ట్ చేస్తుండగా మరికొందరు మెగా ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -