Lavanya Tripathi: మెగా కోడలు లావణ్య పెళ్లికి ముందే అలాంటి పనులు చేస్తోందా.. ఎంతవరకు రైట్ అంటూ?

Lavanya Tripathi:  గత కొద్ది రోజులుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు లావణ్య త్రిపాఠి,వరుణ్ తేజ్. ఇటీవల ఈ జంట ఎంగేజ్మెంట్ వేడుకతో ఒక్కటైన విషయం తెలిసిందే. ఎప్పటినుంచో ప్రేమించుకుంటున్న ఈ జంట ఆ విషయాన్ని బయటపడకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు. అయితే ఎప్పటినుంచో ఈ జంట ప్రేమ విషయంపై డేటింగ్ పై అనేక రకాల వార్తలు వినిపించగా ఎప్పుడూ ఆ వార్తలపై స్పందించలేదు. కానీ ఎట్టకేలకు ఆ వార్తలన్నింటికి చెక్ పెడుతూ ఎంగేజ్మెంట్ వేడుకతో ఒక్కటయ్యారు. ఇది ఇలా ఉంటే ఈ జంట ఎంగేజ్మెంట్ వేడుక జరిగినప్పటి నుంచి పెళ్లి ఎప్పుడు అన్న ప్రశ్నలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

అయితే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నవంబర్‌లో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే పెళ్లి డేట్ పై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఇకపోతే లావణ్య విషయానికి వస్తే.. ఈమె సినిమా అవకాశాల విష‌యంలో మరింత సెలెక్టివ్‌గా ఉండాలని ప్లాన్ చేస్తోంది. ఇటీవ‌ల కొన్ని ముఖ్యమైన ఆఫర్‌లను, వెబ్ సిరీస్‌లను తిరస్కరించింది. ఈ జంట జూన్‌లో నిశ్చితార్థంతో ఒక‌ట‌య్యారు. ఈ జంట‌ తమ వివాహ ప్రణాళికలను అధికారికంగా ప్రకటించనప్పటికీ ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ కి ప్లాన్ చేస్తున్నార‌ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత హైదరాబాద్‌లో విలాసవంతమైన రిసెప్షన్ ఉంటుంది.

నవంబర్‌లో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లికి ప్లాన్ చేస్తున్నారని కూడా గుస‌గుసలు వినిపిస్తున్నాయి. ఇకపోతే తాజాగా అందిన సమాచారం ప్రకారం కోడలిగా తన కొత్త పాత్రకు అనుగుణంగా లావణ్య తన కెరీర్‌లో గణనీయమైన మార్పులు చేయవచ్చని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. పరిశ్రమలో మెగా కుటుంబానికి ఉన్న గొప్ప‌ స్థానం దృష్ట్యా, ఎలాంటి వివాదాలు లేకుండా అన్నిటినీ బ్యాలెన్స్ చేయ‌డానికి పెళ్లి తర్వాత తన సినిమా ఎంపికల్లో మ‌రింత జాగ్ర‌త్త తీసుకోవడం గురించి లావ‌ణ్య ఆలోచిస్తోంది. జూన్‌లో నిశ్చితార్థం జరిగినప్పటి నుండి లావణ్య త్రిపాఠి తన కెరీర్‌కు సంబంధించి నిర్ణయాల్లో మార్పులు చేసిన‌ట్లు క‌థ‌నాలు వస్తున్నాయి. ప్రభావవంతమైన మెగా ఫ్యామిలీకి ఆమె కమిట్‌మెంట్‌ల కారణంగా ఇబ్బంది ఎదురు కాకూడ‌ద‌ని లావ‌ణ్య భావిస్తోంది. అందుకే కొన్ని ముఖ్యమైన సినిమా ఆఫర్‌లను తిరస్కరించిందని, బోల్డ్ కంటెంట్ తో ఉండే వెబ్ సిరీస్‌ను కూడా తిరస్కరించిందని వార్తలు వినిపిస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -