Bigg boss Arohi: కాస్టింగ్ కౌచ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ ఆరోహి!

Bigg boss Arohi: ఆరోహి బిగ్ బాస్ 6 కంటెస్టెంట్ గా అందరికీ సుపరిచితమే. ఆరోహి యాంకరింగ్ గా ప్రముఖ న్యూస్ ఛానల్ టీవీ9 లో కెరియర్ స్టార్ట్ చేయడం జరిగింది. టీవీ9 లో ఇస్మార్ట్ న్యూస్ ద్వారా మంచి పాపులారిటీ పొందింది. తర్వాత అనేక న్యూస్ ఛానల్ లో పనిచేయడం జరిగింది. ఇక ప్రస్తుతం ఆమె బిగ్ బాస్ సీజన్ 6 కు సెలెక్ట్ అయిన సంగతి కూడా తెలిసిందే.

అయితే ఇదంతా పక్కన పెడితే గతంలో ఈమె ఒక మీడియా ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. అందులో తనకు కాస్టింగ్ కౌచ్ గురించి ప్రశ్న ఎదురయింది. అందుకు సమాధానంగా ఏ ఫీల్డ్ లో అయినా ఇది సర్వసాధారణం. ఏదైనా ఆఫర్ ఉంది అంటూ కాస్టింగ్ కౌచ్ ప్రస్తావన వస్తే, ఆఫర్ ను వదిలేస్తే సరిపోతుంది.

కానీ ఎక్కువగా సినీ ఫీల్డ్, మీడియా వంటి పాపులర్ అయిన ఫీల్డ్ లో ఉన్న వారి వార్తలు వైరల్ అవుతాయి. మన జాగ్రత్తలో మనం ఉంటే సరిపోతుంది అని ఆమె పేర్కొనడం జరిగింది. ఇక తన వ్యక్తిగత జీవితంలో తాను ఎన్నో కష్టాలు పడ్డానని, చిన్నతనంలోనే తండ్రి చనిపోవడం ద్వారా అమ్మమ్మ వాళ్లు తన బాగోగులు చూసుకునే వాళ్ళని, ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువును కూడా మధ్యలోనే ఆపేసి ఉద్యోగం చేయవలసి వచ్చిందని తెలిపింది.

చిన్నప్పటినుండి తాను కఠినంగానే పెరిగానని, ఏ సమస్య అయినా ధైర్యంగా ఎదుర్కోవడం అలవాటైందని తెలుపడం జరిగింది. తనకు కూడా అవకాశాలు ఇస్తాం అంటూ వేరే విధంగా మాట్లాడడం ద్వారా తనకు అలాంటివి ఇష్టం ఉండదని ఆ అవకాశాలను అవసరం లేదని వదిలేయడం జరిగింది అని పేర్కొంది.

తాను కాస్టింగ్ కౌచ్ వల్ల ఎక్కువ ఇబ్బందులు పడలేదని, జస్ట్ అవాయిడ్ చేయడం ద్వారా ఎవరు తనను ఎక్కువగా వేధించలేదని తెలిపింది. ప్రస్తుతం బిగ్ బాస్ 6 కంటెస్టెంట్ గా కొనసాగుతూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -