Actress Divi Vadthya: కాస్టింగ్ కౌచ్ పై మొదటిసారి నోరు విప్పిన బిగ్ బాస్ బ్యూటీ దివి!

Actress Divi Vadthya:  ఎన్నో యూట్యూబ్ వీడియోలు వెబ్ సిరీస్ ల ద్వారా గుర్తింపు సంపాదించుకున్న వారిలో దివి ఒకరు. ఇలా వెబ్ సిరీస్ లు, యూట్యూబ్ వీడియోల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె అనంతరం బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు.ఈ విధంగా బిగ్ బాస్ కార్యక్రమాల ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ అనంతరం పలు వెబ్ సిరీస్ లో షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇకపోతే తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి భార్య పాత్రలో నటించారు. ఇక ఈ సినిమా అనంతరం ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా దివి మాట్లాడుతూ ఇండస్ట్రీలో ఉండే క్యాస్టింగ్ కౌచ్ గురించి నోరు విప్పారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ కేవలం ఇండస్ట్రీలోనే కాదు ఎక్కడైనా క్యాస్టింగ్ కౌచ్ ఉంటుంది అయితే అది మనం బిహేవ్ చేసే విధానం పై ఆధారపడి ఉంటుందని తెలిపారు.

ఇండస్ట్రీలోనే కాకుండా మహిళలు పనిచేసే ఏ రంగంలోనైనా వారికి ఇలాంటి ఇబ్బందులు తప్పవని తెలిపారు. ఇకపోతే ఇండస్ట్రీలో కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉందని ఇప్పటివరకు తనని ఎవరూ కూడా కమిట్మెంట్ అడగలేదని అలాంటి ధైర్యం కూడా చేయరని ఈ సందర్భంగా ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇకపోతే క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ ఇద్దరు వ్యక్తుల ఇష్ట ప్రకారం కమిట్ అయితే తప్పులేదని వెల్లడించారు.

ఇలా ఇద్దరు ఇష్ట ప్రకారం రిలేషన్ లో ఉంటే ఆ మూమెంట్ కూడా ఎంజాయ్ చేయవచ్చని… అలా కాకుండా ఒక వ్యక్తికి ఇష్టం లేకుండా మరొకరు బలవంతం చేయడం పూర్తిగా తప్పని ఈ సందర్భంగా దివి కాస్టింగ్ కౌచ్ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇకపోతే సినిమాల గురించి కూడా మాట్లాడుతూ తనకు స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు వస్తే రెమ్యూనరేషన్ లేకుండా కూడా నటిస్తానని తెలిపారు..

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -