Bigg Boss Season 6: బిగ్ బాస్ రేటింగ్….నాగార్జునకు ఇది అవమానమేనా?

Bigg Boss Season 6: బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్యక్రమాలలో బిగ్ బాస్ రియాలిటీ షో కి ఎంతో మంచి ఆదరణ ఉంది.ఈ కార్యక్రమం ఇప్పటికే తెలుగులో ఐదు సీజన్లను పూర్తి చేసుకోవడమే కాకుండా ఒక నాన్ స్టాప్ సీజన్ కూడా పూర్తి చేసుకుని ప్రస్తుతం సీజన్ సిక్స్ బుల్లితరపై ప్రసారమవుతుంది. అయితే ఈ కార్యక్రమం మొదటి సీజన్ నుంచి ప్రస్తుత ప్రసారమవుతున్న సీజన్ ను పోల్చుకుంటే ఈ సీజన్ దారుణమైన రేటింగ్ ఎదుర్కొంటుందని తెలుస్తోంది.

గత సీజన్లలో ఎప్పుడూ కూడా ఇలాంటి రేటింగ్ సొంతం చేసుకోలేదు ఇలా ఈ కార్యక్రమం అత్యంత తక్కువ రేటింగ్ సొంతం చేసుకోవడంతో వ్యాఖ్యాతగా నాగార్జునకు ఇది ఘోర అవమానమేనని పలువురు భావిస్తున్నారు.అయితే ఈ కార్యక్రమం మొదటి సీజన్ నుంచి ఇప్పటివరకు ఏఏ సీజన్ ఎంత రేటింగ్ కైవసం చేసుకుంది అనే విషయానికి వస్తే…

ఈ కార్యక్రమానికి మొదటి సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యతగా వ్యవహరించారు.ఈ సీజన్లో ప్రతి ఒక్కరూ కూడా స్టార్ సెలబ్రిటీలు పాల్గొనడంతో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున రేటింగ్స్ సొంతం చేసుకుంది. అలాగే ఎన్టీఆర్ మాట తీరు కూడా అభిమానులను ఆకట్టుకుంది. ఇలా మొదటి సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ ఏకంగా 16.8 రేటింగ్స్ సొంతం చేసుకుంది.

ఈ సీజన్ తర్వాత రెండవ సీజన్ కు నాచురల్ స్టార్ నాని హోస్టుగా వ్యవహరించారు.ఈ సీజన్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి సెలబ్రిటీలు పాల్గొన్నారు. అయితే ఈ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ రేటింగ్ 15.05 రేటింగ్ సొంతం చేసుకుంది. ఈ సీజన్ తర్వాత మూడవ సీజన్ కు కింగ్ నాగార్జున వ్యాఖ్యతగా వ్యవహరించారు. ఈ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ 17.9 రేటింగ్ కైవసం చేసుకుంది.ఈ సీజన్ నుంచి మిగతా సీజన్లకు నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ వస్తున్నారు.

బిగ్ బాస్ ఫస్ట్ ఎపిసోడ్ రేటింగ్ విషయానికి వస్తే ఈ సీజన్ 18.5 రేటింగ్ సొంతం చేసుకొని అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక సీజన్ 5 నుంచి ఈ కార్యక్రమ రేటింగ్ పడిపోతూ వచ్చాయి సీజన్ 5 కేవలం ఫస్ట్ ఎపిసోడ్ 15.71రేటింగ్ సొంతం చేసుకుంది ఇక తాజాగా ప్రసారమవుతున్నటువంటి సీజన్ సిక్స్ కార్యక్రమం అయితే మరి దారుణంగా రేటింగ్స్ సొంతం చేసుకున్నాను చెప్పాలి. సీజన్ 6 ఫస్ట్ ఎపిసోడ్ కేవలం 8.86రేటింగ్ సొంతం చేసుకుంది బిగ్ బాస్ చరిత్రలోనే అత్యంత దారుణమైన రేటింగ్ ఈ సీజన్ కి వచ్చిందని చెప్పాలి.ఈ విధంగా ఈ సీజన్ రేటింగ్ పడిపోవడానికి కారణాలు కూడా ఉన్నాయి మొదటిది పెద్దగా పేరు ప్రఖ్యాతలు పొందిన సెలబ్రిటీలు లేకపోవడం అదే రోజే క్రికెట్ మ్యాచ్ ఉండటం వల్ల ఈ కార్యక్రమ రేటింగ్ తగ్గిందనే చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -