Shivaji: వైరల్ అవుతున్న బిగ్ బాస్ శివాజీ షాకింగ్ కామెంట్స్.. ఏమైందంటే?

Shivaji: టాలీవుడ్ ప్రముఖ నటుడు శివాజీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు ఎన్నో సినిమాలలో నటించి నటుడుగా మంచి గుర్తింపును ఏర్పరచుకున్న శివాజీ ఆ తర్వాత కాలంలో సినిమాలకు దూరం అయి రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమాల వైపు తొంగి చూడలేదు. తరచూ రాజకీయపరంగా ఏదో ఒక అంశాలతో వార్తలు నిలుస్తూ వచ్చారు. ఇటీవలే తెలుగులో ముగిసిన బిగ్ బాస్ సీజన్ సెవెన్ లోకి కంటెస్టెంస్ట్ గా ఎంట్రీ ఇచ్చి మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు శివాజీ. ఇటీవలే సినిమాలలోకి రావడానికి సెకండ్ ఇన్నింగ్స్ ని కూడా ప్రారంభించారు.

 

ఇది ఇలా ఉంటే గత కొద్దిరోజులుగా శివాజీ పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతూ రాజకీయ అంశాలపై షాకింగ్ కామెంట్స్ చేస్తూ వార్తలు నిలుస్తున్నారు శివాజీ. అందులో భాగంగానే తాజాగా ఆయన చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. బీజేపీకి ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిని అయ్యేవాడిని, తనకు ఆ కెపాసిటి ఉంది అంటూ శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి సందర్భంగా ఒక టీవి చానల్‌తో మాట్లాడగా అందుకు సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో శివాజీ మాట్లాడుతూ..

 

బీజేపీకి ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిని అయ్యేవాడిని కానీ తనకు కావాల్సింది అది కాదని అన్నారు. తాను బీజేపీలో ఉండేవాడినని, బీజేపీకి ఎదురు తిరిగే వాడిని కాదన్నారు. అయితే దేశానికి గుండెకాయ అయిన పార్లమెంట్‌లో ప్రత్యేక హోదాపై కేంద్రం ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేదని అన్నారు. రాష్ట్రానికి అన్యాయం జరిగిందనే బీజేపీలోకి గతంలో వెళ్లానని గుర్తుచేశారు. అయితే రాష్టానికి ప్రత్యేక హోదా ఉంటే మంచిదనే పార్లమెంట్‌లో మాట ఇచ్చారని, కానీ నాయకులు ఏమీ చేయలేదని ఆయన అన్నారు. నేడు ఏపీ ఒక రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు శివాజీ

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -